- Home
- Sports
- Cricket
- టీవీ కోసం ఫీల్డ్ సెట్ చేస్తున్నట్టు ఉంది! ఇలా షో చేయడం వల్ల విజయాలు రావు.. బెన్ స్టోక్స్‌పై సునీల్ గవాస్కర్
టీవీ కోసం ఫీల్డ్ సెట్ చేస్తున్నట్టు ఉంది! ఇలా షో చేయడం వల్ల విజయాలు రావు.. బెన్ స్టోక్స్‌పై సునీల్ గవాస్కర్
వరుస విజయాలు అందుకుంటున్నప్పుడు ఏం చేసినా, ఎలా చేసినా అడిగే వాళ్లు ఉండరు. అదే ఒక్కసారి రిజల్ట్ తేడా కొడితే, ప్రతీ చిన్న దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బెన్ స్టోక్స్ పరిస్థితి ఇదే...

Ben Stokes
బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో వరుస విజయాలు అందుకున్న బెన్ స్టోక్స్ అండ్ టీమ్, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో దూకుడు కాస్త అతి ఆవేశంగా మారడంతో చేతులు కాల్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు కూడా ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్, 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
Ben Stokes
ఈ మ్యాచ్‌లో ఒక్కో ఆసీస్ బ్యాటర్‌ని అవుట్ చేయడానికి ఒక్కో రకమైన వ్యూహాత్మక ఫీల్డింగ్ సెట్ చేశాడు బెన్ స్టోక్స్. స్టీవ్ స్మిత్ కోసం బ్యాటర్ వెనకాల రెండు వైపులా ఆరుగురు ఫీల్డర్లను మోహరించిన బెన్ స్టోక్స్, ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేయడం కోసం స్లిప్పులో ఉండాల్సిన ఫీల్డర్లను ఎదురుగా మోహరించాడు..
‘ఇంగ్లాండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్, అక్కడి జనాలకు బాగా ఎక్కేసింది. ఇంగ్లాండ్ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తోంది. ఇంతకుముందు చూడని షాట్స్‌తో ఇష్టం మొచ్చినట్టుగా బాదేస్తున్నారు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ బాద్యతలు తీసుకున్నాక ఇంగ్లాండ్ టీమ్‌కి ఫ్రీడమ్ వచ్చేసింది..
Ben Stokes
అయితే ఈ బజ్‌బాల్ ఎక్కడ ఆగుతుంది. బౌలింగ్‌లో మాత్రం ఇంగ్లాండ్ కొత్తగా ఏమీ చేయడం లేదు. ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. వికెట్‌కి రెండు వైపులా ఫీల్డర్లను మొహరించాడు. అయితే దీని వల్ల లాభం ఏంటి?
England vs Australia
ఇది టీవీ కోసం సెట్ చేసిన ఫీల్డింగ్‌లాగే అనిపించింది. అలాంటి ఫీల్డింగ్‌లో ఏ బ్యాటర్ కూడా అవుట్ కాడు. ఇంగ్లాండ్‌కి దక్కిన అవకాశాలను కూడా అందుకోలేకపోయింది. అదే స్లిప్‌లో ఫీల్డర్లు ఉన్నా, సాధారణ ఫీల్డింగ్ సెట్ చేసి ఉన్నా వికెట్లు దక్కేవి..
Usman Khawaja
టీవీల్లో పడడానికి షో చేయడం వల్ల విజయాలు రావు. ఈ విషయాన్ని బెన్ స్టోక్స్ అండ్ టీమ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..