MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసంతో న్యూజిలాండ్‌ చిత్తు.. భారత్ రికార్డు విజయం

IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసంతో న్యూజిలాండ్‌ చిత్తు.. భారత్ రికార్డు విజయం

India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ (113) విధ్వంసకర సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. పలు రికార్డులను సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మ ఊచకోత.. కివీస్‌పై సూపర్ విక్టరీ
Image Credit : X

అభిషేక్ శర్మ ఊచకోత.. కివీస్‌పై సూపర్ విక్టరీ

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లోని హన్రీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Image Credit : X/BCCI

అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ

ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న శర్మ.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 35 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. కవర్ ఏరియాను లక్ష్యంగా చేసుకుంటూ అతను ఆడిన షాట్లు అద్భుతమని చెప్పాలి. న్యూజిలాండ్ బౌలర్లలో జేమిసన్ రెండు వికెట్లు తీసినప్పటికీ, భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు.

35
పవర్‌ప్లేలో పరుగుల వరద
Image Credit : X/BCCI

పవర్‌ప్లేలో పరుగుల వరద

భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి విరుచుకుపడింది. కొత్త ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి బరిలోకి దిగిన అభిషేక్ శర్మ మొదటి ఓవర్ నుంచే బాదడం మొదలుపెట్టాడు. జాకబ్ డఫీ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 26 పరుగులు పిండుకున్నారు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు సాధించింది. ఇది టీ20 చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు కావడం విశేషం. వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుతంగా ఆడి 19 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశారు.

45
రికార్డుల మోత మోగించిన భారత్
Image Credit : Getty

రికార్డుల మోత మోగించిన భారత్

ఈ మ్యాచ్‌లో భారత్ అనేక రికార్డులను తిరగరాసింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే అనగా 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పూర్తి సభ్య దేశాల జాబితాలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా 190కి పైగా లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా, అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.

55
సిరీస్ విజయంపై హర్షం
Image Credit : bcci

సిరీస్ విజయంపై హర్షం

మ్యాచ్ ముగిసినంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ, భారత బ్యాటర్ల జోరును ఆపడం కష్టమని, వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ మాట్లాడుతూ, కోచింగ్ సిబ్బంది అందించిన సపోర్ట్, నెట్స్‌లో చేసిన కఠిన సాధన వల్లే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని తెలిపాడు. చివరగా నామన్ ధీర్ కొట్టిన బౌండరీతో భారత్ ఘన విజయాన్ని పూర్తి చేసుకుని, సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(28.0 ov)92/1
SLSL
98
Day 1 - Session 3
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
MS Dhoni: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై.. కానీ సీఎస్కేతోనే కొత్త ప్రయాణం !
Recommended image2
Harshal Patel: సన్‌రైజర్స్ బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌ను సగం ధరకే పట్టేసిన గుజరాత్ టైటాన్స్
Recommended image3
Kavya Maran Car Collection: హాట్ టాపిక్‌గా కావ్య మారన్ లగ్జరీ కార్లు.. రూ. 12 కోట్ల రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు లిస్ట్ ఇదే
Related Stories
Recommended image1
Kapil Dev vs Sunil Gavaskar: కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మధ్య 25 ఏళ్ల పగ.. అసలు ఏం జరిగింది?
Recommended image2
Abhishek Sharma: సిక్సర్ల తుపాను.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులు బ్రేక్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved