- Home
- Sports
- Cricket
- విరాట్ విషయంలో అలా చేసి, రోహిత్ శర్మ కోసం స్పెషల్ ఏర్పాట్లు... బీసీసీఐ ద్వంద్వ వైఖరిపై...
విరాట్ విషయంలో అలా చేసి, రోహిత్ శర్మ కోసం స్పెషల్ ఏర్పాట్లు... బీసీసీఐ ద్వంద్వ వైఖరిపై...
విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య సంబంధాలు బాగోలేవని కొన్నిరోజులుగా వినిపిస్తున్న టాక్. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం తర్వాత జరిగిన పరిణామాలు గమనించిన వారికి, భారత క్రికెట్ బోర్డులో ఏదో జరుతుందనే విషయం అర్థమయ్యే ఉంటుంది...

విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు బెంగళూరు వేదికగా ఆడాలని అనుకున్నాడు. ఆర్‌సీబీకి హోం గ్రౌండ్ లాంటి చిన్న స్వామి స్టేడియంలో నూరో టెస్టు ఆడాలనే ఉద్దేశంతోనే జోహన్‌బర్గ్ టెస్టు నుంచి తప్పుకున్నాడు...
అయితే విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్‌కి, బీసీసీఐ రాజకీయాలతో చెక్ పెట్టేసింది. బెంగళూరు జరగాల్సిన టెస్టును కాస్తా మొహాలీకి మార్చేసింది...
తొలుత స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా కోహ్లీ వందో టెస్టుని నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేసినా, విరాట్ అభిమానుల డిమాండ్‌తో దిగి వచ్చింది...
ఆఖరి నిమిషాల్లో నిర్ణయం మార్చుకుని 50 శాతం ప్రేక్షకులతో మొహాలీ టెస్టు మ్యాచ్ నిర్వహించింది బీసీసీఐ. అయితే రోహిత్ శర్మ కోసం ఈ రూల్స్ మార్చేసింది భారత క్రికెట్ బోర్డు...
కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. వరుసగా 13 మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ టీమ్, మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు...
స్వదేశంలో అది కూడా పెద్దగా ఫామ్‌లో లేని వెస్టిండీస్, శ్రీలంక జట్లపై ఘన విజయాలు నమోదు చేస్తూ... కెప్టెన్‌గా తన ప్రస్తానాన్ని మొదలెట్టాడు రోహిత్ శర్మ...
ఇప్పటికే 399 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన రోహిత్ శర్మకు బెంగళూరు టెస్టు 400వ మ్యాచ్ కానుంది. దీంతో రోహిత్ మైలురాయి మ్యాచ్‌కి 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...
ఈ నిర్ణయం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. విరాట్ కోహ్లీ 100వ టెస్టుకి ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని చూసి, ఫ్యాన్స్ డిమాండ్‌తో 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ, రోహిత్‌కి మాత్రం 100 శాతం అనుమతించడం ఏంటని ప్రశ్నస్తున్నారు అభిమానులు...
విరాట్ కోహ్లీని కావాలని తొక్కేయాలని ప్రయత్నిస్తే, చూస్తూ ఊరుకోమని... బీసీసీఐ ద్వంద్వ వైఖరికి స్వస్తి పలికి.. మాజీ కెప్టెన్‌ని గౌరవించడం నేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు...