- Home
- Sports
- Cricket
- పంత్ పనికి రాడు, హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వండి... టీమిండియా వరుస ఓటములతో...
పంత్ పనికి రాడు, హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వండి... టీమిండియా వరుస ఓటములతో...
అప్పుడెప్పుడో ఈ ఏడాది ఆరంభంలో జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతుల్లో ఓడింది భారత జట్టు. ఓటమిని ఏడాదిని ప్రారంభించిన టీమిండియా, మిగిలిన జట్లపై విజయాలు అందుకుంటున్నా, సౌతాఫ్రికాను ఓడించలేకపోయింది...

ఈ ఏడాది జోహన్‌బర్గ్, కేప్ టౌన్ టెస్టుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ ఓడి క్లీన్ స్వీప్ అయ్యింది. సఫారీ గడ్డపై ఎదురైన పరాభవానికి స్వదేశంలో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే... ఇక్కడా ఆ కోరిక నెరవేరడం లేదు...
ఢిల్లీలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడినట్టైంది భారత జట్టు..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు లక్కీగా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్, తొలి రెండు మ్యాచుల్లో విజయాలను అందుకోలేకపోయాడు. రెండో టీ20లో అయితే బ్యాటర్‌గానూ రాణించలేకపోయాడు...
దీంతో రిషబ్ పంత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి ఐపీఎల్ 2022లో కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు కొందరు సోషల్ మీడియా జనాలు...
ఐపీఎల్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే కెప్టెన్సీ ఇస్తే అతను ఆటోమేటిక్‌గా అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో ఇరగదీస్తాడని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...
అంతేకాకుండా టీమిండియాకి కొరకరాని కొయ్యగా మారిన డేవిడ్ మిల్లర్‌ను ఎలా అవుట్ చేయాలో అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న హార్ధిక్ పాండ్యాకి బాగా తెలిసి ఉంటుందని, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కెప్టెన్సీ మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు...
అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయ్యింది టీమిండియా. అలాగే రిషబ్ పంత్‌కి కూడా కెప్టెన్‌గా నిరూపించుకునేందుకు కొన్ని ఛాన్సులు ఇవ్వాలంటున్నారు కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...