- Home
- Sports
- Cricket
- అహ్మదాబాద్‌లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... హైదరాబాద్‌లో వన్డే వరల్డ్ కప్ మ్యాచులు లేనట్టేనా...
అహ్మదాబాద్‌లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... హైదరాబాద్‌లో వన్డే వరల్డ్ కప్ మ్యాచులు లేనట్టేనా...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగియడంతో పాటు ఆసియా కప్ 2023 టోర్నీపై కూడా క్లారిటీ వచ్చేసింది. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ని త్వరలో విడుదల చేయనుంది ఐసీసీ...

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం 9 వేదికలను ఐసీసీ, బీసీసీఐ ఖరారు చేసినట్టు సమాచారం. అహ్మదాబాద్‌తో పాటు చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత్తా, పూణే, ధర్మశాల నగరాల్లో వన్డే ప్రపంచ కప్ జరగబోతున్నట్టు సమాచారం...
హైదరాబాద్ నగరాన్ని వన్డే వరల్డ్ కప్ వేదికల షార్ట్ లిస్ట్ నుంచి బీసీసీఐ తొలగించినట్టు సమాచారం. 2021 టీ20 వరల్డ్ కప్‌కి ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి భాగ్యనగరమే వేదిక ఇవ్వాల్సింది...
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ, ఇండియా నుంచి యూఏఈకి మారడంతో హైదరాబాద్ జనాలకు దాయాదుల సమరం చూసే అవకాశం మిస్ అయ్యింది...
ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచుల నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్టర్ ఫ్లాప్ కావడమే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ నిర్వహించకూడదనే నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది..
అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడే టీమిండియా, ఢిల్లీలో అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది..
అక్టోబర్ 19న పూణేలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడే భారత జట్టు, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో నవంబర్ 5న కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడుతుంది..
Dharmashala stadium
ముంబైలో క్వాలిఫైయర్ 1 టీమ్‌తో మ్యాచ్ ఆడే భారత జట్టు, నవంబర్ 11న క్వాలిఫైయర్ 2 టీమ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఐసీసీ అధికారిక ప్రకటన చేయలేదు..