- Home
- Sports
- Cricket
- సూర్య ఆడినట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడలేరు! సెలక్టర్లకు హర్భజన్ సింగ్ సపోర్ట్..
సూర్య ఆడినట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడలేరు! సెలక్టర్లకు హర్భజన్ సింగ్ సపోర్ట్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ పేరు ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యని ఏకంగా ప్రపంచ కప్‌కి ఎంపిక చేయడం ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు..

Suryakumar Yadav
వన్డేల్లో 55కి పైగా సగటుతో పరుగులు చేస్తున్న సంజూ శాంసన్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు సెలక్టర్లు. అదే టైంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో 25 సగటు కూడా లేని సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే వరల్డ్ కప్ 2023కి ఎంపిక చేశారు. దీనికి కారణం అతను ముంబై ఇండియన్స్ ప్లేయర్ కావడమే అంటున్నారు చాలామంది.
Suryakumar Yadav
‘సంజూ శాంసన్‌కి అన్యాయం జరిగిందని నేనైతే అనుకోవడం లేదు. అవును, సంజూ శాంసన్ చాలా మంచి ప్లేయర్, టాలెంటెడ్ బ్యాటర్. అయితే వరల్డ్ కప్‌కి కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయగలం..
సంజూ శాంసన్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ కచ్ఛితంగా వరల్డ్ కప్ ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజూ శాంసన్‌కి అవకాశం రాదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్..
చాలామంది నా అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. అయితే అతను ఏం చేయగలడో టీ20 ఫార్మాట్‌లో అందరూ చూశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సూర్యకుమార్ యాదవ్‌లా ఆడలేరు..
నెం.5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. ఇంతకుముందు ధోనీ, యువరాజ్ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఈ ప్లేసుల్లో బ్యాటింగ్ చేశారు. మిడిల్ ఓవర్లలో వచ్చి 50 ఓవర్ల వరకూ బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు మాత్రమే ఈ ప్లేసుల్లో ఆడగలరు..
Suryakumar Yadav
సూర్యకుమార్ యాదవ్‌లో ఈ టాలెంట్ పుష్కలంగా ఉంది. మిడిల్ ఓవర్లలో సింగిల్స్ తీస్తూ, 35 ఓవర్లు దాటిన తర్వాత వేగంగా ఆడగలడు...
ఇప్పుడున్న భారత జట్టులోని ప్లేయర్లందరిలో ఈ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్ కంటే బాగా ఆడగల ప్లేయర్ ఎవ్వరూ లేరు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..