MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌కి కామెంటేటర్‌గా ఇయాన్ మోర్గాన్... రిటైర్మెంట్ ఇచ్చిన ఐదు నిమిషాలకే...

ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌కి కామెంటేటర్‌గా ఇయాన్ మోర్గాన్... రిటైర్మెంట్ ఇచ్చిన ఐదు నిమిషాలకే...

2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐర్లాండ్ తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి మారి కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలిచిన ఇయాన్ మోర్గాన్, 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టిన కొన్ని నిమిషాలకే కామెంటేటర్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నట్టు ప్రకటించాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 30 2022, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Eoin Morgan

Eoin Morgan

ఇండియాతో టీ20, వన్డే సిరీస్‌కి ముందు ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఈ వైట్ బాల్‌ సిరీస్‌కి కొత్త కెప్టెన్‌ని ప్రకటించనుంది ఈసీబీ...  అయితే కెప్టెన్‌గా తప్పుకున్న ఇయాన్ మోర్గాన్, ఇదే సిరీస్ ద్వారా కామెంటేటర్‌గా రంగప్రవేశం చేయబోతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటన వచ్చిన ఐదు నిమిషాలకే ‘స్కై’ నెట్‌వర్క్, మోర్గాన్ తమ కామెంటరీ టీమ్‌లో చేరాడని ప్రకటన విడుదల చేసింది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తన కెరీర్‌లో 248 వన్డేలు ఆడి 40కి పైగా సగటుతో 7701 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, 16 టెస్టులు ఆడి 700 పరుగులు చేశాడు. 115 టీ20 మ్యాచుల్లో 2458 పరుగులు చేసిన మోర్గాన్, అంతర్జాతయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లలో టాప్ 6లో ఉన్నాడు...

37
Eoin Morgan

Eoin Morgan

క్రికెట్‌కి పుట్టినిల్లు అయినా ఒక్క వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయిందనే అపవాదును ఇంగ్లాండ్ నుంచి దూరం చేసిన కెప్టెన్‌గా నిలిచాడు ఇయాన్ మోర్గాన్. భారీ అంచనాలతో 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్, ఆ అంచనాలకు మించి రాణించి మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ గెలిచింది...

47

బెన్ స్టోక్స్ బ్యాటుకి తగులుతూ వెళ్లిన ఓవర్ త్రోకి ఆరు పరుగులు ఇవ్వడం, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు... ఇలా ఛీటింగ్ చేశారని ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా క్రికెట్ ప్రపంచ చరిత్రలోనే  సూపర్ ఓవర్ థ్రిల్లర్ ఫైనల్ మ్యాచ్‌ని చూసే అవకాశం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కలిగింది...

57

2015లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ తీసుకున్న ఇయాన్ మోర్గాన్, 2019లో ఇంగ్లాండ్‌కి వన్డే వరల్డ్ కప్ అందించాడు. మోర్గాన్ కెప్టెన్సీలోనే 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు, టేబుల్ టాపర్‌గా నిలిచినా... సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...

67

విజయాలు వస్తూనే రెండున్నరేళ్లుగా సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు ఇయాన్ మోర్గాన్.  ఐపీఎల్ 2021 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, సీజన్ మొత్తంలో 17 మ్యాచులాడి 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
 

77

ఇండియా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఏమో అనుకోవచ్చు కానీ నెదర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు వన్డేల్లోనూ డకౌట్ అయిన ఇయాన్ మోర్గాన్, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Recommended image3
IND vs WI: 2027 వన్డే వరల్డ్ కప్ వేట షురూ.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved