MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐదేండ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళా ఇంగ్లాండ్ క్రికెటర్లు..

ఐదేండ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళా ఇంగ్లాండ్ క్రికెటర్లు..

Katherine Brunt and Nat Sciver: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లు ఆదివారం పెళ్లి చేసుకున్నారు. 

1 Min read
Srinivas M
Published : May 30 2022, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ లో కీలక ఆటగాళ్లుగా ఉన్న కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ లు మే 29న  పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ లో భారత సంతతి  క్రికెటర్ ఇషా గుహ తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. 

26

2017లో లార్డ్స్ లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్  లో భాగంగా ఇంగ్లాండ్ కు ఆ ఏడాది ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరూ.. గత ఐదేండ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.  

36

2018 నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. 2019 లో ఈ జంట.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. 2020 లోనే కేథిరన్-సీవర్ లు పెళ్లి చేసుకుందామని భావించారు. 

46

కానీ కరోనా కారణంగా వీరి పెళ్లి పలు దఫాలు వాయిదా పడింది. కాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో పాటు ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరూ ఇక పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నారు. మే 29న ఇంగ్లాండ్ లో ఈ ఇద్దరూ క్రిస్టియన్ సంప్రదాయంలో  వివాహం  చేసుకున్నారు. ఈ పెళ్లికి  ఇంగ్లాండ్ క్రికెటర్లు హాజరయ్యారు. 

56

కాగా.. క్రికెట్ ప్రపంచంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదే ప్రథమం కాదు.  గతంలో న్యూజిలాండ్ కు చెందిన అమీ సాటర్త్వేట్-లీ తహుహు లు వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. 

66

అంతేగాక సౌతాఫ్రికా కు చెందిన లిజెల్లె లీ - టాంజా క్రోంజ్ కూడా  2020 సెప్టెంబర్ లో  పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ కూడా తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ రెండు జంటల తర్వాత ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కూడా  పెళ్లి చేసుకోవడం గమనార్హం. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved