బాగుంది అబ్బాయిలు, మేం మొదలెట్టక ముందే... ఇంగ్లాండ్ జట్టును ఎగతాళి చేసిన మహిళా క్రికెటర్...
పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి, ఆ దేశ క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసేలా ఉంది. ఇంగ్లాండ్ ఓటమి తర్వాత ఇంగ్లీష్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్‌లీ వేసిన ఓ ట్వీట్, పురుష క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించింది....
మొతేరా స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకి, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రావ్లే తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 53 పరుగులే ఆ జట్టు తరుపున అత్యధిక స్కోరు...
ఈ ఓటమి అనంతరం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్‌లీ... ‘బాగుంది ఇంగ్లాండ్ బాయ్స్... మీరు ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టు ఆట ప్రారంభించకముందే, టెస్టు మ్యాచ్‌ను ముగించేశారు... ఇక మా మ్యాచ్ చూడండి’ అంటూ ట్వీట్ చేసింది... ఇంగ్లాండ్ ఆటతీరును అవమానించేలా ఉన్న ఈ ట్వీట్‌పై ఇంగ్లాండ్ మెన్స్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు...
‘యావరేజ్ ట్వీట్.. వుమెన్స్ జట్టు ఓడిపోతే పురుషుల క్రికెట్ జట్టులోని ఎవ్వరూ కూడా ఇలా ట్వీట్ చేయరు...’ అంటూ ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ ట్వీట్ చేశాడు...
ఇంగ్లాండ్ టెస్టు ఓపెనర్ రోరీ బర్న్స్ కూడా అలెక్స్ ట్వీట్‌పై స్పందించాడు. ‘అబ్బాయిలందరూ మహిళల క్రికెట్‌కి మద్ధతు ఇస్తున్నప్పుడు ఈ యాటిట్యూడ్ ఏ మాత్రం మంచిది కాదు...’ అంటూ ట్వీట్ చేశాడు రోరీ బర్న్స్...
ఇంగ్లాండ్ మెన్స్ క్రికెటర్లు సీరియస్ అవ్వడంతో అలెక్స్ హార్ట్‌లీ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ‘నేను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవర్నీ తక్కువ చేసి కించపరచాలని అనుకోలేదు... మేం కూడా టెస్టు మ్యాచ్ అభిమానులమే...’ అంటూ ట్వీట్ చేసింది అలెక్స్ హార్ట్‌లీ...
టీమిండియాపై జో రూట్ ఐదు వికెట్లు తీసిన తర్వాత... ‘రవిచంద్రన్ అశ్విన్ ఇక్కడ ఏదైతే చేయగలడో, జో రూట్ కూడా దాన్ని చేసి చూపించగలడు...’ అంటూ ట్వీట్ చేసింది అలెక్స్ హార్ట్‌లీ...
ఈ ట్వీట్‌కి కూడా టీమిండియా అభిమానుల నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ కోసం ఐపీఎల్ జట్లు పోటీ పడుతున్నాయని, జో రూట్ మాత్రం ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోతున్నాడని... అలెక్స్ హార్ట్‌లీని ట్రోల్ చేశారు టీమిండియా అభిమానులు...
ఐపీఎల్ 2020 సీజన్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ‘వచ్చే సీజన్‌లో కూడా ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందా?’ అని ఓ వుమెన్ క్రికెటర్ వేసిన ట్వీట్‌కి ‘డెఫినట్‌లీ నాట్’ అంటూ ధోనీ ఫేమస్ డైలాగ్‌తో సమాధానం ఇచ్చింది అలెగ్జాండర్ హార్ట్‌లీ...