MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా

వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా

England vs South Africa : సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై వన్డే చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది.

3 Min read
Mahesh Rajamoni
Published : Sep 07 2025, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు విజయం
Image Credit : X/ICC

సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు విజయం

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆదివారం సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఏకంగా 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పురుషుల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా ఘనత సాధించింది. సౌతాఫ్రికా చెత్త రికార్డును నమోదుచేసింది.

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 VICTORY by 342 runs! 🦁

The biggest ever winning margin in Men's ODI cricket! 🙌 pic.twitter.com/hJ2eqEZJZT

— England Cricket (@englandcricket) September 7, 2025

DID YOU
KNOW
?
భారత్ రికార్డు బ్రేక్
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు భారత్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. టీమిండియా 2023లో శ్రీలంకపై సాధించిన 317 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ అధిగమించింది.
26
జాకబ్ బెతెల్ తొలి సెంచరీ.. రూట్ సూపర్ నాక్
Image Credit : X/ICC

జాకబ్ బెతెల్ తొలి సెంచరీ.. రూట్ సూపర్ నాక్

సౌతాఫ్రికాపై 21 ఏళ్ల జాకబ్ బెతెల్ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 82 బంతుల్లో 110 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ చూపించాడు. 

Firsts are always special! ❤️

Well done on your maiden hundred in International cricket, Jacob Bethell. It’s just the start of the JB era. 💪🙌#PlayBold#ನಮ್ಮRCB#ENGvSApic.twitter.com/RBj35epRXl

— Royal Challengers Bengaluru (@RCBTweets) September 7, 2025

అలాగే, సీనియర్ స్టార్ ప్లేయర్ జో రూట్ 96 బంతుల్లో 100 పరుగులు చేసి 19వ వన్డే సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కి 182 పరుగుల భాగస్వామ్యం చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు.

The Utilita Bowl stands for Joe Root 🫡

Another glorious ton for the 🐐👏 pic.twitter.com/p8nEe63Opr

— England Cricket (@englandcricket) September 7, 2025

Related Articles

Related image1
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్
Related image2
ఆసియా కప్ హాకీ 2025: ఛాంపియన్ గా భారత్.. కొరియాపై 4-1తో సూపర్ విక్టరీ
36
జేమీ స్మిత్, జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ లు
Image Credit : X/ICC

జేమీ స్మిత్, జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ లు

జేమీ స్మిత్ 62 పరుగులు నాక్ తో ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం అందించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. చివరి పది ఓవర్లలో ఇంగ్లాండ్ 115 పరుగులు సాధించింది. సూపర్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ జట్టు 414/5 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జోరు ముందు దక్షిణాఫ్రికా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒత్తిడిలో 19 వైడ్ బంతులు వేశారు.

Piling on the runs here in Southampton! 🔥

Buttler has played another gem of an innings 💎 pic.twitter.com/7YB1SCvF1b

— England Cricket (@englandcricket) September 7, 2025

46
సౌతాఫ్రికాను చిత్తుచేసిన జోఫ్రా ఆర్చర్
Image Credit : X/ICC

సౌతాఫ్రికాను చిత్తుచేసిన జోఫ్రా ఆర్చర్

ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సౌతాఫ్రికాను కోలుకోని దెబ్బకొట్టాడు. ఆర్చర్ తన పునరాగమన సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 7 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. బ్యాటర్లను ఇబ్బందిపెట్టే సాధారణ వేగంతో అద్భుతమైన లైన్ తో బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. ఆర్చర్ కు తోడుగా బ్రైడన్ కార్స్ కూడా కీలక వికెట్లు సాధించాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Wicket in the first over! 🔥

Archer nicks off Markram with the second ball of the innings 🤩 pic.twitter.com/iegW6B8wS5

— England Cricket (@englandcricket) September 7, 2025

56
దక్షిణాఫ్రికా చెత్త రికార్డు
Image Credit : X/ICC

దక్షిణాఫ్రికా చెత్త రికార్డు

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది. ఎక్కడా కూడా ప్రభావం చూపలేక చెత్త రికార్డును నమోదుచేసింది. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టుగా సౌతాఫ్రికా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ టెంబా బవుమా గాయంతో ఆడకపోవడం దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆరంభంలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 10 ఓవర్లలో 24/6గా నిలిచింది. చివరికి 72 పరుగులకే ఆరంభ 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది. ఒక్క ప్లేయర్లు పరుగులు చేయడంలో ప్రభావం చూపలేకపోయారు.

66
సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు నూతన ఉత్సాహం
Image Credit : X/ ICC

సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు నూతన ఉత్సాహం

ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయినా, చివరి మ్యాచ్‌లో చరిత్ర సృష్టించి మానసిక బలాన్ని పెంచుకుంది. జాకబ్ బెతెల్ వంటి యువ ఆటగాడు ప్రతిభ చాటగా, జో రూట్ అనుభవాన్ని చూపించాడు. జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్‌గా తిరిగి రావడం రాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులో మంచి ఉత్సాహం నింపింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జోఫ్రా ఆర్చర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కేశవ్ మహరాజ్ నిలిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved