- Home
- Sports
- Cricket
- ఇంగ్లాండ్ సీ టీమ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్... నెం.1 బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ డకౌట్...
ఇంగ్లాండ్ సీ టీమ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్... నెం.1 బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ డకౌట్...
ఇంగ్లాండ్ సీ టీమ్ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసింది. ఒక్కటంటే ఒక్కరోజు ఆకస్మాత్తుగా జట్టుకి ఎంపికైన ప్లేయర్లతో బెన్‌స్టోక్స్, పాకిస్తాన్ జట్టును తొలి వన్డేలో చిత్తు చేశాడు... బౌలర్లు, బ్యాట్స్‌మెన్ రాణించడంతో మొదటి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టుకి మొదటి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. ఇమామ్ వుల్ హక్, బాబర్ ఆజమ్ ఇద్దరూ డకౌట్ కావడంతో సున్నాకే రెండు వికెట్లు కోల్పోయింది పాక్ జట్టు...

వికెట్ కీపర్ రిజ్వాన్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేయగా ఫకార్ జమాన్ 67 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాదబ్ ఖాన్ 43 బంతుల్లో ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు...

35.2 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్. ఇంగ్లాండ్ యంగ్ బౌలర్ సకీబ్ మహ్‌మూద్ 4 వికెట్లు తీయగా మాథ్యూ పార్కిసన్, క్రియాగ్ ఓవర్టన్ రెండేసి వికెట్లు తీశారు...

142 పరుగుల టార్గెట్‌ను ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 21.5 ఓవర్లలోనే చేధించింది ఇంగ్లాండ్ జట్టు. ఫిలిప్ సాల్క్ 7 పరుగులు చేసి అవుటైన డేవిడ్ మలాన్ 69 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు, జాక్ క్రావ్లే 50 బంతుల్లో 7 ఫోర్లతో 58 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించారు...

పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన బృందంలో ముగ్గురు ప్లేయర్లు కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్ జట్టు హుటాహుటీన కొత్త జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో ఆడిన జట్టుతో పోలిస్తే 11 మార్పులతో బరిలో దిగామని కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్ చేయడం విశేషం.

కెప్టెన్‌గా ఇంగ్లాండ్ టూర్‌లో ఆడిన మొదటి వన్డేలోనే డకౌట్ అయిన బాబర్ ఆజమ్, మూడు ఫార్మాట్లలో సున్నాకే పెవిలియన్ చేరిన మొట్టమొదటి పాకిస్తాన్ కెప్టెన్‌గా నిలిచాడు..