కెఎల్ రాహుల్ కోసం శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేశారు! ఇక కష్టమే... హర్భజన్ సింగ్ కామెంట్...
ఐపీఎల్‌కి ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐదు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చి... రెండు మ్యాచులకే మళ్లీ గాయపడ్డాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్ ఆడతాడని ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ..
Shreyas Iyer
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో వెన్ను గాయంతో బ్యాటింగ్‌కి రాలేదు శ్రేయాస్ అయ్యర్. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని, 5 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు..
ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు ఎన్‌సీఏలో నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 199 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి... మెడికల్ క్లియరెన్స్ పొందాడు. అయితే అదంతా ఉత్తిదేనా? అనే అనుమానాలు రేగుతున్నాయి..
Shreyas Iyer
‘గాయం కారణంగా 5-6 నెలలు ఆటకు దూరంగా ఉన్న వ్యక్తి, కేవలం ఒక్క మ్యాచ్ ఆడి గాయపడడం చాలా పెద్ద విషయం. దీన్ని తేలిగ్గా తీసి పడేయకూడదు. ప్లేయర్లు గాయపడడం చాలా కామన్. అయితే మరీ ఇంతలా ఇబ్బందిపడడం నేనెప్పుడూ చూడలేదు..
లక్కీగా ప్లేయర్లు గాయపడితే రిప్లేస్‌మెంట్ చేయొచ్చు. ఆ సౌకర్యం లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అతను ఫిట్‌గా లేనప్పుడు వరల్డ్ కప్‌కి ఎందుకు సెలక్ట్ చేశారు?
Shreyas Iyer-KL Rahul
పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో అయ్యర్ చాలా ఫిట్‌గా కనిపించాడు. చక్కని కవర్ డ్రైవ్ కూడా ఆడాడు.. ఇప్పుడు ఎలా గాయపడ్డాడు. దీన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..
‘నా ఉద్దేశంలో మరీ ఇంత తరుచుగా ఇబ్బందిపెడుతున్నాయంటే బ్యాడ్ లక్ అయినా అయ్యుండాలి. లేదా కెఎల్ రాహుల్ కోసం శ్రేయాస్ అయ్యర్‌ని సైడ్ చేసేందుకు గాయం వంక వాడి అయినా ఉండాలి..
Image credit: Getty
వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఇలా గాయపడితే, జట్టులో అతని ప్లేస్‌కి గ్యారెంటీ పోతుంది. కెఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు.తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు...
ఇప్పుడు అయ్యర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడానికి టీమిండియా సిద్దంగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ప్లేయర్ తిరిగి గాయపడితే, ఎన్‌సీఏ ఏం చేస్తుంది? జాతీయ క్రికెట్ అకాడమీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..