పాకిస్తాన్‌కి మరో షాక్... టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఇంగ్లాండ్...
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్, అర్ధాంతరంగా సిరీస్ ఆరంభానికి ముందు అభద్రతాభావంతో వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పాక్‌కి మరో దెబ్బ తగిలింది... న్యూజిలాండ్ ఎఫెక్ట్‌తో ఇంగ్లాండ్ కూడా పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది...

మొదటి వన్డే సిరీస్ ఆరంభానికి ముందు సెక్యూరిటీ కారణాలతో టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, స్వదేశానికి పయనమైంది న్యూజిలాండ్. కివీస్ బోర్డు చేసిన పనితో ఇంగ్లాండ్ జట్టు కూడా ఆలోచనలో పడింది.
రిస్క్ చేయడం ఇష్టం లేదంటూ ఇప్పుడు పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది... ఈ ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌లో రెండు టీ20 మ్యాచులు ఆడేందుకు అంగీకరించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
రావల్పిండి వేదికగా అక్టోబర్ 13, 14 తేదీల్లో ఈ టీ20 మ్యాచులు జరగాల్సి ఉంది... అలాగే ఇదే సమయంలో ఇంగ్లాండ్ మహిళా జట్టు కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది.
అయితే పాక్ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్, టూర్ ఆరంభానికి ముందే భయభ్రాంతులతో వెనక్కి తిరిగి రావడంతో పాక్‌తో సిరీస్‌లను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఇంగ్లాండ్...
‘మా ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ మానసిక సంక్షేమాన్ని, శారీరక భద్రతను దృష్టిలో ఉంచుకుని, క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించడం క్షేమం కాదని భావించి... ఈ టూర్‌ను రద్దు చేస్తున్నాం...
ఇప్పటికే చాలా రోజుల నుంచి కరోనా ప్రోటోకాల్, కోవిద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్లేయర్లను, పాక్ టూర్‌తో మరింత రిస్క్‌లోకి నెట్టలేం..
మా నిర్ణయం పీసీబీని నిరుత్సాహపరుస్తుందని తెలుసు, అయితే వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలుపుతూ, టూర్‌ను రద్దు చేసుకుంటున్నందుకు క్షమాపణలు చెబుతున్నా...’ అంటూ ప్రకటన ద్వారా తెలియచేసింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు...