MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం

దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం

Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరగనుంది. 6 జోన్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో మొత్తం 5 నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2025, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దులీప్ ట్రోఫీ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
Image Credit : ANI

దులీప్ ట్రోఫీ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దులీప్ ట్రోఫీ 2025కి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ప్రముఖ రెడ్ బాల్ టోర్నమెంట్‌లలో ఒకటైన ఈ టోర్నమెంట్ ఈసారి కూడా జోన్ వారీగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్‌లు దులీప్ ట్రోఫీలో పోటీపడనున్నాయి.

ఈ టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు జరుగుతుంది. మొత్తం ఐదు నాకౌట్ మ్యాచ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

DID YOU
KNOW
?
దులీప్ ట్రోఫీ పేరు వెనుక కథ
దులీప్ ట్రోఫీని 1961-62 సీజన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది. ఈ టోర్నమెంట్ భారతీయ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ పోటీ. భారతీయ క్రికెటర్ దులీప్‌సిన్హ్జీ పేరు మీద ఏర్పాటు చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దులీప్ ట్రోఫీ 2025 ఆరంభ మ్యాచ్ లు ఏవి?
Image Credit : Getty

దులీప్ ట్రోఫీ 2025 ఆరంభ మ్యాచ్ లు ఏవి?

దులీప్ ట్రోఫీలో ప్రారంభ మ్యాచ్‌లు ఆగస్టు 28న రెండు క్వార్టర్ ఫైనల్స్‌తో మొదలవుతాయి.

• క్వార్టర్ ఫైనల్ 1: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్

• క్వార్టర్ ఫైనల్ 2: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్

ఈ మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఓడిన జట్లు నేరుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాయి. గెలిచిన జట్లు సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే సెమీఫైనల్స్‌కి అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు జరుగుతుంది.

36
దులీప్ ట్రోఫీ 2025 ఫార్మాట్ ఏమిటి? ఈ టోర్నీ జరిగే వేదికలు ఏవి?
Image Credit : Getty

దులీప్ ట్రోఫీ 2025 ఫార్మాట్ ఏమిటి? ఈ టోర్నీ జరిగే వేదికలు ఏవి?

ఈసారి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ మళ్లీ సంప్రదాయ జోనల్ ఫార్మాట్‌లోనే జరుగుతుంది. గతంలో వాడిన గ్రూప్ స్టైల్ పద్ధతిని తొలగించారు. ప్రతి మ్యాచ్‌తో పాటు ఫైనల్‌ వరకు అన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) I సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఉంటుంది. 

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కర్ణాటకలోని బెంగళూరు, దేవనహళ్లి సమీపంలో ఉంది. గతంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో అభివృద్ధి చేశారు. ఈ కేంద్రం 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారత క్రికెట్‌కు ప్రపంచ స్థాయి శిక్షణ వేదికగా నిలుస్తోంది. 

ఇక్కడ మూడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలు, 86 ప్రాక్టీస్ పిచ్ లు, ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలు ఉన్నాయి. క్రికెటర్లకు నూతన సాంకేతికతలతో శిక్షణ, రిహాబిలిటేషన్, విశ్లేషణా సేవలు అందిస్తున్నాయి.

46
దులీప్ ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు
Image Credit : Getty

దులీప్ ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు

దులీప్ ట్రోఫీని క్రికెట్ అభిమానులు అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

• టీవీ లైవ్ ప్రసారం: స్పోర్ట్స్18 ఛానల్

• లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్స్ ద్వారా ఉచితంగా చూడొచ్చు.

56
దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్
Image Credit : Getty

దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్

• క్వార్టర్ ఫైనల్ 1: నార్త్ జోన్ vs ఈస్ట్ జోన్

తేదీలు: 28 ఆగస్టు - 31 ఆగస్టు 2025, ఉదయం 9:30 IST

వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

• క్వార్టర్ ఫైనల్ 2: సెంట్రల్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్

తేదీలు: 28 ఆగస్టు - 31 ఆగస్టు 2025, ఉదయం 9:30 IST

వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

• దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ 1: సౌత్ జోన్ vs TBD

తేదీలు: 4 సెప్టెంబర్ - 7 సెప్టెంబర్ 2025

వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

• దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ 2: వెస్ట్ జోన్ vs TBD

తేదీలు: 4 సెప్టెంబర్ - 7 సెప్టెంబర్ 2025

వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

• దులీప్ ట్రోఫీ ఫైనల్: TBD vs TBD

తేదీలు: 11 సెప్టెంబర్ - 14 సెప్టెంబర్ 2025

వేదిక: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

66
దులీప్ ట్రోఫీ 2025లో పాల్గొనే జోన్లు & రాష్ట్రాలు ఏవి?
Image Credit : Getty

దులీప్ ట్రోఫీ 2025లో పాల్గొనే జోన్లు & రాష్ట్రాలు ఏవి?

నార్త్ జోన్: చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, సర్వీసెస్

సౌత్ జోన్: ఆంధ్రప్రదేశ్, గోవా, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు

సెంట్రల్ జోన్: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రైల్వేస్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, విదర్భ

ఈస్ట్ జోన్: అస్సాం, బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర

నార్త్ ఈస్ట్ జోన్: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం

వెస్ట్ జోన్: బరోడా, గుజరాత్, మహారాష్ట్ర, ముంబై, సౌరాష్ట్ర

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G పై భారీ తగ్గింపు
Recommended image2
భారత జట్టు లో మూడు ప్రధాన మార్పులు? బీసీసీఐ ఏం ప్లాన్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved