MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేను నిజాలు మాట్లాడితే, మీ కాపురాలు కూలిపోతాయి జాగ్రత్త... పాక్ క్రికెటర్లకు ఉమర్ అక్మల్ వార్నింగ్...

నేను నిజాలు మాట్లాడితే, మీ కాపురాలు కూలిపోతాయి జాగ్రత్త... పాక్ క్రికెటర్లకు ఉమర్ అక్మల్ వార్నింగ్...

పాక్ క్రికెట్ టీమ్‌లో వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ నుంచి అరడజను మంది ప్లేయర్లు ఉన్నారు. కమ్రాన్ అక్మల్ తమ్ముడు ఉమర్ అక్మల్, పాక్ తరుపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టెస్టులు ఆడాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 22 2023, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను బుకీలు సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టి నిషేధానికి గురైన ఉమర్ అక్మల్, పాకిస్తాన్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌కి మకాం మార్చి, అక్కడ క్లబ్స్ తరుపున ఆడేందుకు ఒప్పందం కూడా చేసుకున్నాడు...

27

చివరిగా 2019లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడిన ఉమర్ అక్మల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్‌, గ్లోబల్ టీ20 కెనడా లీగ్స్‌లో ఆడాడు. తాజాగా తన టీమ్ మేట్స్‌ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఉమర్ అక్మల్...

37

‘టీమ్‌లో చాలామంది క్రికెటర్లు నేను ఇంకా మానసికంగా ఎదగలేదని చెబుతూ ఉంటారు. నాతో కలిసి పాక్ టీమ్‌కి ఆడిన వాళ్లలో చాలామంది ఇలా అనడం విన్నాను. వాళ్లు నా సీనియర్లు కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడేవాడిని...
 

47
umar akmal

umar akmal

అయితే ఒక్క విషయం నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను మీ విషయాలు బయటపెడతా. మీ గురించి నిజాలు మాట్లాడితే, చాలా మంది కాపురాలు కూలిపోతాయి. టీమ్‌లో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పేవాడిని. అందుకే చాలామంది నా జోలికి వచ్చేవాళ్లు కాదు..

57

పాక్ జనాలు చాలా అమాయకులు, క్రికెట్‌ని చూడడానికి ఎంతో ఇష్టపడతారు. వాళ్లంటే నాకు గౌరవం. మేం అభిమానించే క్రికెటర్లు ఇలాంటి వాళ్లని తెలిస్తే, ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. అవి బయటికి వస్తే క్రికెట్ చూడడం కూడా మానేస్తారు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్...
 

67

పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్ నుంచి పాక్ టీమ్‌లో షాదబ్ ఖాన్ వంటి వారంతా లైంగిక వేధింపులు, ఛీటింగ్ వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్ వంటి వారిపై కూడా కేసులు ఉన్నాయి.

77

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్‌తో పాటు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్, షాహిదీ ఆఫ్రిదీ కూడా చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే ఉమర్ అక్మల్ చెప్పిన ఆ సీనియర్లు ఎవరో, ఆ సీక్రెట్స్ ఏంటో అతను చెబితే కానీ తెలీదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Ind vs Pak : భారత్ అంటే అంత భయమా? కొలంబోలో రసవత్తర పోరు.. పాక్ అసలు గుట్టు ఇదే
Recommended image2
ఎవరీ పూజా యాదవ్..? మాజీ క్రికెటర్ కైఫ్ వైఫ్ ది హీరోయిన్లకు తీసిపోని అందం
Recommended image3
హాలిడే ప్లాన్ టూ వరల్డ్‌కప్‌లోకి సడన్ ఎంట్రీ.. అంతా దేవుడి రాత అంటున్న హైదరాబాదీ మియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved