MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విడాకుల తర్వాత ఫుల్లుగా దానిపై ఫోకస్ పెట్టిన శిఖర్ ధావన్... ఆ విషయాలను మరిచిపోవడానికి...

విడాకుల తర్వాత ఫుల్లుగా దానిపై ఫోకస్ పెట్టిన శిఖర్ ధావన్... ఆ విషయాలను మరిచిపోవడానికి...

భారత ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ గత 6 సీజన్లుగా ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. వరుసగా 6 సీజన్లలో 400+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన ధావన్, ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్‌ సెకండ్ ఫేజ్‌కి ముందు శిఖర్ ధావన్ వైవాహిక జీవితంలో అలజడి వచ్చింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 02 2021, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఫేస్‌బుక్‌లో కలిసి అయేషా ముఖర్జీని ప్రేమించి, పెళ్లాడిన శిఖర్ ధావన్... 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

211

తన కంటే వయసులో పదేళ్లు పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన అయేషాను ఏరికోరి ప్రేమించి, పెళ్లాడాడు శిఖర్ ధావన్. అయితే ఈ ఇద్దరి వైవాహిక జీవితానికి విడాకుల రూపంలో 8 ఏళ్లకే ఫుల్‌స్టాప్ పడింది...

311

ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన అయేషా,  తొలుత ఓ ఆస్ట్రేలియా బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడింది. వీరికి 2000 సంవత్సరంలో ఆలియా, 2005లో రియా అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు...

411

అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. భర్తతో విడిపోయి, పిల్లలతో కలిసి జీవిస్తున్న అయేషా ముఖర్జీని... భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చూసిన శిఖర్ ధావన్, చూడగానే తను ప్రత్యేకంగా అనిపించడంతో ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు..

511

అలా ఏర్పడిన పరిచయం... స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి మూడు ముళ్ల బంధంగా మారింది. ఈ ఇద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు...

611

సెంచరీ చేసినా, క్యాచ్ పట్టినా, డకౌట్ అయినా ముఖంపై చిరునవ్వు చెదరనివ్వని శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో వచ్చిన అలజడితో మానసికంగా కృంగిపోయాడట. 

711

అయితే కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న శిఖర్ ధావన్, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి తనని తాను బిజీగా ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాడట...

811

విడాకుల తర్వాత ‘జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిపై నీకున్న పూర్తి శక్తి సామర్థ్యాలను పెట్టాలి. అలాగే మనసు కూడా... నువ్వు చేసే పనిని ప్రేమించాలి... నువ్వు వేసే ప్రతీ అడుగునీ ఎంజాయ్ చేయాలి...’ అంటూ రాసుకొచ్చాడు శిఖర్ ధావన్...

911

విడాకుల తర్వాత ఆ ఆలోచనలు, తన మనసుని తొలిచివేయకుండా ఉండేందుకు ఫిట్‌నెస్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడట శిఖర్ ధావన్. ప్రాక్టీస్ సెషన్స్ ముగిసిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువసేపు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గడిపిస్తున్నాడట...

1011

ఐపీఎల్ 2020లో రెండు సెంచరీలతో 618 పరుగులు చేసిన శిఖర్ ధావన్, 2021 సీజన్‌లో 12 మ్యాచుల్లో 454 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు... ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

1111

అయితే బీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ శిఖర్ ధావన్‌కి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో చోటు కల్పించలేదు సెలక్టర్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
Recommended image2
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు
Recommended image3
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved