- Home
- Sports
- Cricket
- తొక్కలో రంజీ ట్రోఫీని ఆపేయండి! ఇంకెందుకు ఆడడం... సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు ఇవ్వకపోవడంపై సన్నీ ఫైర్...
తొక్కలో రంజీ ట్రోఫీని ఆపేయండి! ఇంకెందుకు ఆడడం... సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు ఇవ్వకపోవడంపై సన్నీ ఫైర్...
టీమిండియా టెస్టు టీమ్‌కి సెలక్ట్ కావడానికి రంజీ ట్రోఫీయే ప్రామాణీకం. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు రంజీల్లో ఎంత బాగా ఆడినా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా ఐపీఎల్‌లో బాగా ఆడకపోతే ఆ ప్లేయర్ వేస్టే! అతనికి టీమిండియాలో అవకాశం దక్కదు గాక దక్కదు..

Image credit: BCCI
రంజీ ట్రోఫీల్లో రికార్డు లెవెల్లో పరుగులు ప్రవాహం సృష్టిస్తూ, ఫస్ట్ క్లాస్ సగటులో ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోటీపడుతున్నాడు సర్ఫరాజ్ ఖాన్... భారత జట్టులో ప్లేస్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి మరోసారి నిరాశే ఎదురైంది...
ఐపీఎల్‌లో బాగా ఆడారనే కారణంగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లను టెస్టు టీమ్‌కి ఎంపిక చేసిన సెలక్టర్లు, సర్ఫరాజ్ ఖాన్‌కి మరోసారి మొండిచేయి చూపించారు... దీంతో రంజీ ట్రోఫీని ఆపేయాలంటూ బీసీసీఐపై ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..
‘సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి...
తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు..
రెడ్ బాల్ క్రికెట్‌కి కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ పెట్టడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...
sarfaraz khan
ఓవరాల్‌గా రంజీ ట్రోఫీల్లో 37 మ్యాచులు ఆడి 79.65 సగటుతో 13 సెంచరీలతో 3505 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అంతకుముందు 2021-22 సీజన్‌లో 4 సెంచరీలతో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు..