- Home
- Sports
- Cricket
- అటు టీమిండియాలోకి, ఇటు ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్... ఇషాన్ కిషన్ మరింత పైకి...
అటు టీమిండియాలోకి, ఇటు ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్... ఇషాన్ కిషన్ మరింత పైకి...
మూడేళ్ల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ పర్పామెన్స్ కారణంగా ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ బుల్లెట్ స్పీడ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్...

Image credit: PTI
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 46 యావరేజ్‌తో 158.62 స్ట్రైయిక్ రేటుతో 92 పరుగులు చేశాడు దినేశ్ కార్తీక్... నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ చేసి, 16 ఏళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు.
Image credit: PTI
టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20లో ఫినిషర్ రోల్ పోషించి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన దినేశ్ కార్తీక్, 16 ఏళ్ల తర్వాత టీ20 కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసి.. భారత జట్టుకి విజయాన్ని అందించాడు...
ఈ పర్ఫామెన్స్‌తో ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 108 స్థానాలు ఎగబాకిన దినేశ్ కార్తీక్, 87వ స్థానానికి చేరుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌లో కార్తీక్, ఇదే రకమైన పర్పామెన్స్ చూపిస్తే.. టాప్ 20లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం...
Image credit: PTI
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచుల్లో కలిపి 41 సగటుతో 206 పరుగులు చేసిన భారత యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, మరో స్థానం ఎగబాకి టాప్ 6 ర్యాంకింగ్‌ని సాధించాడు... టీమిండియా తరుపున టీ20ల్లో టాప్ 10లో ఏకైక బ్యాటర్ ఇషాన్ కిషన్..
Image credit: PTI
ఈ సిరీస్‌లో 6 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, 3 స్థానాలు దిగజారి టాప్ 23 స్థానానికి చేరుకోగా టీ20 సిరీస్‌లో 6 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన భువనేశ్వర్ కుమార్, ఓ స్థానం కోల్పోయి 14వ స్థానంలో ఉన్నాడు...
బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌లో కెఎల్ రాహుల్, టాప్ 15లో ఉండగా రోహిత్ శర్మ టాప్ 18, శ్రేయాస్ అయ్యర్ టాప్ 19 స్థానాల్లో ఉన్నారు. గత ఏడాది టీ20ల్లో టాప్ 4లో ఉన్న విరాట్ కోహ్లీ.. టాప్ 21వ స్థానానికి పడిపోయాడు.
Image Credit: Getty Images
టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లా టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ 2లోకి ఎంటర్ అయ్యాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం కోల్పోయి టాప్ 3లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతున్నాడు...