- Home
- Sports
- Cricket
- అతను కామెంటేటర్‌గానే పనికొస్తాడు, టీమ్‌లో ప్లేస్ వేస్ట్... దినేశ్ కార్తీక్‌పై షాకింగ్ కామెంట్స్...
అతను కామెంటేటర్‌గానే పనికొస్తాడు, టీమ్‌లో ప్లేస్ వేస్ట్... దినేశ్ కార్తీక్‌పై షాకింగ్ కామెంట్స్...
మూడేళ్ల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి వచ్చి ఫినిషర్‌గా మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్‌కి ఆసియా కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ చోటు కల్పించారు సెలక్టర్లు... ఆసియా కప్‌లో బాగా ఆడితే, టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ కార్తీక్‌కి చోటు దక్కొచ్చు...

Image credit: PTI
కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తుండడంతో తుదిజట్టులో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌లను ఆడించడం కష్టంగా మారింది. రిషబ్ పంత్‌ని ఆడిస్తే, దినేశ్ కార్తీక్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కార్తీక్ కావాలంటే పంత్‌ని పక్కనబెట్టాలి..
Image credit: PTI
రీఎంట్రీ తర్వాత గత 14 ఇన్నింగ్స్‌ల్లో 133.33 స్ట్రైయిక్ రేటుతో 192 పరుగులు చేశాడు దినేశ్ కార్తీక్. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మొట్టమొదటి టీ20 హాఫ్ సెంచరీ చేసిన దినేశ్ కార్తీక్, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
Image credit: PTI
‘ఇప్పుడు టీమిండియా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ఆడాలని భావిస్తోంది. అలాగే ఆటను కొనసాగించాలంటే ప్లేయర్లను కూడా ఆచితూచి ఎంచుకోవాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు దినేశ్ కార్తీక్ కూడా వేగంగా పరుగులు చేయగలడు...
Image credit: PTI
అయితే దినేశ్ కార్తీక్ అన్ని వేళలా ఉపయోగపడడు. రోహిత్, విరాట్ అందుబాటులో లేకపోతే దినేశ్ కార్తీక్‌ని తప్పక ఆడించాలి. ఆ ఇద్దరూ ఉంటే దినేశ్ కార్తీక్‌కి జట్టులో పెద్దగా పని ఉండదు...
అతను మంచి కామెంటేటర్. అయితే అతన్ని నేను ఆసియా కప్ వంటి మెగా టోర్నీల్లో ఆడించను. నా పక్కన కూర్చోబెట్టి కామెంటేటర్‌గా చేయమని అడుగుతా...
మహ్మద్ షమీకి టీమ్‌లో ఎందుకు చోటు లేదో నాకైతే అర్థం కావడం లేదు. నేను సెలక్టర్‌ని అయితే ముందుగా మహ్మద్ షమీని, బౌలర్లను సెలక్ట్ చేస్తాను...
Image credit: PTI
బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ షమీ... ఈ నలుగురు టీమ్‌కి చాలా అవసరం. అలాగే బ్యాటింగ్‌లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా తప్పక తుది జట్టులో ఉండాలి.... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ అజయ్ జడేజా...