- Home
- Sports
- Cricket
- బిర్యానీ, స్వీట్లు... అడ్డమైన గడ్డి తినేవాడు! ఇప్పుడేమో...విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై దినేశ్ కార్తీక్...
బిర్యానీ, స్వీట్లు... అడ్డమైన గడ్డి తినేవాడు! ఇప్పుడేమో...విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై దినేశ్ కార్తీక్...
టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు అవుతున్నా, గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడని మ్యాచులు కేవలం ఐదు. అద్భుతమైన ఫిట్‌నెస్‌తో మిగిలిన ప్లేయర్లకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు విరాట్.. అయితే కోహ్లీ ఫిట్‌నెస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు దినేశ్ కార్తీక్...

Image credit: PTI
అహ్మదాబాద్ టెస్టు సమయంలో జ్వరంతో బాధపడుతున్న విరాట్ కోహ్లీ, ఏకంగా 9 గంటల పాటు క్రీజులో నిలదొక్కుకుపోయి 186 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉంటే, మిగిలిన పరుగులన్నీ సింగిల్స్ ద్వారానే వచ్చాయి...
‘విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే నా బుర్రలో మొదట వచ్చే పేరు ఒక్కటే క్రమ శిక్షణ. రెండోది ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ అనేది కేవలం జిమ్‌కి వెళ్లి గంటలు గంటలు వ్యాయామం చేయడం, లేక పొద్దున్నే లేచి గ్రౌండ్‌లో పరుగులు తీయడమో కాదు... అది లైఫ్ స్టైల్...
మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేవి వర్కవుట్స్ కంటే చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఎంతో క్రమ శిక్షణగా ఉంటాడు.. విరాట్ కోహ్లీ క్రమశిక్షణ విషయంలో బ్రిలియెంట్ ప్లేయర్...
నిజానికి విరాట్ కోహ్లీ ఫుడ్డీ... అతనికి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ, స్వీట్స్, కొవ్వు పెంచే పదార్థాలన్నీ నచ్చినట్టుగా తినేవాడు. మనంలాగే చాలా నార్మల్‌గా ఉండేవాడు. అయితే కెరీర్ మీద ఫోకస్ పెట్టాక అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది...
ఫిట్‌గా ఉండేందుకు ఎన్ని త్యాగాలు చేయాలో అన్నీ చేశాడు. ఒక్క మ్యాచ్, ఒక్క ఏడాది గురించి విరాట్ కోహ్లీ ఆలోచించలేదు. వచ్చే పదేళ్లు నేను ఎలా ఉండాలి? ఎలా ఆడాలని ప్రణాళిక రచించుకున్నాడు. అలా ఉండేందుకు నేనేం వదులుకోవాలో అన్నీ వదులుకోవడానికి సిద్ధమయ్యాడు..
ఇప్పుడు చూస్తున్న విరాట్ కోహ్లీ, పదేళ్ల క్రితం అతను తీసుకున్న కొన్ని కచ్ఛితమైన నిర్ణయాల వల్లే తయారయ్యాడు. పరుగులు చేయనప్పుడు కూడా విరాట్ కోహ్లీ తన లైఫ్ స్టైల్‌ని మార్చుకోలేదు, డైట్‌ని వదిలేసి నచ్చింది తినలేదు...
Image credit: PTI
పరుగులు వచ్చినా, రాకపోయినా ఒకే లైఫ్ స్టైల్‌ని ఫాలో అయ్యాడు. ట్రైయినింగ్‌ని వదల్లేదు. పరుగులు రానప్పుడు ఇంత కష్టపడడం ఎందుకు? ఇంతకుముందులా నీకు నచ్చింది తిను, ఇష్టం వచ్చినట్టు ఉండు... అని తన మనసు చెప్పి ఉంటుంది. కానీ విరాట్ మాత్రం మళ్లీ అలా వెనక్కి వెళ్లాలని అనుకోలేదు...
విరాట్ కోహ్లీ 8 గంటలు బ్యాటింగ్ చేసిన తర్వాత కూడా సింగిల్స్, డబుల్స్ తీసేందుకు ఒకే రకమైన ఎనర్జీని చూపించాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి ఇచ్చిన ప్రాధాన్యం అలాంటిది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..