- Home
- Sports
- Cricket
- ఉపుల్ తరంగతో ఆ సంబంధం పెట్టుకున్న దిల్షాన్ మాజీ భార్య... కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే...
ఉపుల్ తరంగతో ఆ సంబంధం పెట్టుకున్న దిల్షాన్ మాజీ భార్య... కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే...
ఏ వ్యక్తి అయినా కెరీర్‌లో సక్సెస్ అయితే అందులో సగం వాటా జీవిత భాగస్వామి భార్యకు ఇచ్చేస్తుందీ సమాజం. అయితే సక్సెస్‌లో భార్య వాటా సగం ఉంటే, ఫెయిల్యూర్‌లో మాత్రం సెంట్ పర్సెంట్ ఉంటుంది... సాధారణ వ్యక్తుల విషయంలో కథలు బయటికి రాకున్నా, క్రికెటర్ల విషయంలోనూ ఇది రుజువైంది..

ధోనీ కంటే ముందే టీమిండియాలోకి వచ్చి అదరగొట్టిన దినేశ్ కార్తీక్, అంతర్జాతీయ కెరీర్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. కారణం అతని వ్యక్తిగత జీవితంలో చెలరేగిన ప్రకంపనలే...
దినేశ్ కార్తీక్ మాజీ భార్య నికిత వంజరా, అతని స్నేహితుడు మురళీ విజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దినేశ్ కార్తీక్ గ్రౌండ్‌లో మ్యాచులు ఆడుతుంటే, అదే సమయంలో అతని భార్య నికితాతో మురళీ విజయ్, వారి ఇంట్లోనే బెడ్ రూమ్‌లో ఆటలు ఆడేవాడు...
స్నేహితుడు చేసిన ఈ ద్రోహాన్ని తెలుసుకోవడానికి దినేశ్ కార్తీక్‌కి చాలా సమయమే పట్టింది. నికితా, మురళీ విజయ్ కారణంగా తల్లైన తర్వాత అసలు విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్, ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ సంఘటనలతో దినేశ్ కార్తీక్, చాలా విలువైన క్రికెట్ కెరీర్‌ని కోల్పోయాడు..
శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ కెరీర్‌లోనూ ఇలాంటి సంఘటనలే జరిగాయట. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసే దిల్షాన్, నిలంక వితంగే అనే యువతిని ప్రేమించి పెళ్లాడాడు..
అయితే పెళ్లైన కొద్దిరోజులకే దిల్షాన్ స్నేహితుడు ఉపుల్ తరంగతో వివాహేతర సంబంధం పెట్టుకుంది నిలంక వితంగే. దిల్షాన్‌తో ఓపెనింగ్ చేసే ఉపుల్ తరంగ, ప్రాక్టీస్ పేరుతో వాళ్ల ఇంటికి వెళ్లి, నిలంకతో బెడ్ రూమ్ ప్రాక్టీస్ మొదలెట్టాడట..
ఈ విషయం తెలుసుకున్న తిలకరత్నే దిల్షాన్, నిలంక వితంగేకి విడాకులు ఇచ్చాడు. అయితే భరణం కోసం దిల్షాన్‌ని కోర్టు మెట్లు ఎక్కించిన నిలంక, అతన్ని మానసికంగా, ఆర్థికంగా చిదిమేసింది. విడాకుల తర్వాత కొడుకుని కూడా దూరం చేసుకున్న దిల్షాన్, మళ్లీ కెరీర్‌లో కుదురుకోవడానికి చాలా సమయమే పట్టింది...
నిలంక చేసిన గాయానికి నటి మంజుల థిలిని రూపంలో కాలమే మందు వేసింది. విడాకుల తర్వాత కొన్నాళ్లకు మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దిల్షాన్. వీరికి ఇదరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు..
87 టెస్టులు, 330 వన్డేలు, 80 టీ20 మ్యాచులు ఆడిన తిలకరత్నే దిల్షాన్, అంతర్జాతీయ కెరీర్‌లో 17 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు కూడా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నిన్నటి తరం క్రికెటర్లలో దిల్షాన్ కూడా ఒకడు.