రాయల్స్‌కి చుక్కలు చూపించిన దేవ్‌దత్ పడిక్కల్, కోహ్లీ... ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా నాలుగో విక్టరీ...

First Published Apr 22, 2021, 10:58 PM IST

గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి దొరికిన యంగ్ డైనమెట్ దేవ్‌దత్ పడిక్కల్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటిసారి తన విశ్వరూపం చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల మోత మోగించాడు. ఆగ్నికి వాయువు తోడైనట్టు విరాట్ కోహ్లీ కూడా తన స్టైల్‌లో హాఫ్ సెంచరీ బాదడంతో వరుసగా నాలుగో విజయం అందుకుంది ఆర్‌సీబీ...