MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అండర్ -19 కెప్టెన్లంటే వాళ్లకు అదో తుర్తి.. ఒక్క విరాట్ తప్ప అందరూ ఢిల్లీకే..

అండర్ -19 కెప్టెన్లంటే వాళ్లకు అదో తుర్తి.. ఒక్క విరాట్ తప్ప అందరూ ఢిల్లీకే..

WPL Auction: సోమవారం ముంబై వేదికగా ముగిసిన  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో   ఢిల్లీ క్యాపిటల్స్  అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.  ఆ జట్టు  మరోసారి అండర్ - 19 కెప్టెన్ నే నమ్ముకుంది. 

2 Min read
Srinivas M
Published : Feb 14 2023, 11:26 AM IST| Updated : Feb 14 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్  ఇంతవరకూ  టైటిల్ ను దక్కించుకోలేదు. అయినా  కూడా ఆ టీమ్ కు క్రేజ్, కావాల్సినంత గ్లామర్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు.  2020లో ఒకసారి ఫైనల్ వరకూ చేరినా  తర్వాతి సీజన్లలో విఫలమవుతున్నది. అతిరథ మహామహులు సారథులుగా వ్యవహరించిన ఈ టీమ్ కు  ఓ ప్రత్యేకత ఉంది. 

27

సోమవారం ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో   ఢిల్లీ.. టీమిండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మను రూ. 2 కోట్ల ధరతో దక్కించుకుంది.  జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.2కోట్లు) తర్వాత ఆ టీమ్ ఓ ఇదే హయ్యస్ట్ బిడ్. కాగా  షెఫాలీని దక్కించుకోవడం ద్వారా  ఢిల్లీ ఓ ఘనతను దక్కించుకుంది. 

37

ఇప్పటివరకు భారత జట్టు తరఫున   అండర్ - 19 ప్రపంచకప్ లో సారథ్యం వహించినవారిలో ఒక్క విరాట్ కోహ్లీ తప్ప మిగిలినవారంతా   ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడినవారే కావడం గమనార్హం. కోహ్లీ  అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతడిని   వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది. అప్పట్నుంచీ అతడు  బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. మిగిలినవారి జాబితాను ఓసారి చూద్దాం. 

47

కోహ్లీ తర్వాత అండర్ - 19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన  సారథి  ఉన్ముక్త్ చంద్ ను ఢిల్లీ 2011లో దక్కించుకుంది. 2011 నుంచి 2013 వరకూ ఢిల్లీకి ఆడాడు.  ఆ తర్వాత అతడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండిన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

57

ఉన్ముక్త్ తర్వాత పృథ్వీ షా వంతు. గత నాలుగు సీజన్లుగా షా ఢిల్లీకి ఆడుతున్నాడు.  2018లో షా..  అండర్ -19  ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షా  ఢిల్లీ  క్యాపిటల్స్ లో భాగమయ్యాడు.  ఇప్పుడు ఢిల్లీలో అతడే కీలక ఆటగాడు. 

67

చంద్, షా ల తర్వాత  అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన  యశ్ ధుల్ ను కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది.  ధుల్.. గతేడాది   వెస్టిండీస్ వేదికగా ముగిసిన అండర్ - 19 వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు సారథి. ఆ తర్వాత కొద్దిరోజులకే జరిగిన వేలంలో ధుల్ ను  కోటి రూపాయలు వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 

77

ఇక తాజాగా షెఫాలీ కూడా ఢిల్లీకే ఆడనుంది.   షెఫాలీ సారథ్యంలోని అండర్ - 19 భారత మహిళల జట్టు.. జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ను సాధించిన విషయం తెలిసిందే.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved