MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీకి రిప్లేస్‌మెంట్‌ అవుతాడనుకుంటే, ఆఖరికి స్టాండ్‌బై ప్లేయర్‌గా దీపక్ హుడా... ఏడాదిలో ఎంత మార్పు!

కోహ్లీకి రిప్లేస్‌మెంట్‌ అవుతాడనుకుంటే, ఆఖరికి స్టాండ్‌బై ప్లేయర్‌గా దీపక్ హుడా... ఏడాదిలో ఎంత మార్పు!

దీపక్ హుడా.. ఏడాది క్రితం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఆడించాలని గట్టిగా వినిపించిన పేరు. అయితే ఏడాది తర్వాత చూస్తే, టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్న దీపక్ హుడా, ఆసియా క్రీడల్లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 19 2023, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సయ్యద్ ముస్తాక్ ఆలీ 2020 సమయంలో కృనాల్ పాండ్యాతో గొడవపడి, బరోడా టీమ్ నుంచి బయటికి వచ్చేసిన దీపక్ హుడా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Deepak Hooda

Deepak Hooda

2022 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై వన్డే ఆరంగ్రేటం చేసిన దీపక్ హుడా, అదే నెలలో శ్రీలంకపై టీ20 ఆరంగ్రేటం చేశాడు. ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన దీపక్ హుడా, నాలుగో స్థానంలో ఆశాకిరణంలా కనిపించాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతూ వచ్చాడు..

39

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీకి బదులుగా మంచి ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాడు..

49

అయితే కపిల్ దేవ్ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్లు చేశాడో కానీ అప్పటి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. మూడేళ్లుగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌ని అందుకుంటే, అప్పటిదాకా అదరగొట్టిన దీపక్ హుడా... ఒక్కసారిగా చల్లబడిపోయాడు.

59
Deepak Hooda

Deepak Hooda

ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించి, టీమ్‌లో తన స్థానంపై వచ్చిన విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు..

69
Deepak Hooda

Deepak Hooda

అయితే విరాట్ కోహ్లీకి రిప్లేస్‌మెంట్‌గా భావించిన దీపక్ హుడా మాత్రం ఏడాదిగా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు.  జూన్ 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది, సంజూ శాంసన్‌తో కలిసి 176 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడాని.. ఆసియా క్రీడలకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు..

79
Deepak Hooda

Deepak Hooda

ఐపీఎల్ 2023 సీజన్‌లో 12 మ్యాచులు ఆడి కేవలం 84 పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు దీపక్ హుడా. అయినా అతన్ని ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. 35కి పైగా సగటుతో పరుగులు చేసిన నితీశ్ రాణా వంటి ప్లేయర్లను కాదని, దీపక్ హుడాని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని ట్రోల్స్ వినిపించాయి.

89

రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడలు ఆడే టీమ్‌లో సీనియర్ ప్లేయర్లు ఉండాలనే ఉద్దేశంతోనే దీపక్ హుడాని చైనాకి పంపుతున్నట్టు తెలుస్తోంది.. 6 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 68.33 సగటుతో 350 పరుగులు చేసిన దీపక్ హుడా... టీమిండియాకి టీ20ల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కూడా అతని ఎంపికకి ఓ కారణం.

99

స్టాండ్ బై ప్లేయర్ కాబట్టి ఆసియా క్రీడల్లో దీపక్ హుడాకి ఆడే అవకాశం రావాలంటే తుది జట్టులో ఉన్న ప్లేయర్లు ఎవ్వరైనా గాయపడాల్సిందే. దీపక్ హుడా  మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ 2024 సీజన్‌లో బాగా ఆడడం ఒక్కటే మార్గం..

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved