DCvsKXIP: నేటి మ్యాచులో కీ ప్లేయర్లు వీళ్లే...

First Published 20, Sep 2020, 4:57 PM

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మూడు సార్లు మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ, మొదటి సీజన్‌లో నాలుగోస్థానంలో నిలిచింది. ఇదే ఇప్పటిదాకా ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. అయితే గత సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ, ఫ్లే ఆఫ్ చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ముఖ్యంగా లీగ్‌లో యంగ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్, యువకులతో కూడిన ఢిల్లీ జట్టును నడిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సారి యంగ్ ప్లేయర్లకు తోడు రహానే, అశ్విన్ వంటి సీనియర్లు కూడా ఢిల్లీ జట్టులో చేరారు.

క్రిస్‌గేల్: పంజాబ్ జట్టులో కీ ప్లేయర్ క్రిస్‌గేల్. ‘యూనివర్సల్ బాస్’ గేల్ క్రీజులో ఉంటే, ప్రత్యర్థి బౌలర్లను ఊచకత కోస్తాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటిదాకా 4500లకి పైగా పరుగులు చేసిన గేల్, ఐదు సెంచరీలు కూడా నమోదుచేశాడు.

కెఎల్ రాహుల్: భారత జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిన కెఎల్ రాహుల్, దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. ఐపీఎల్ కెరీర్‌లో ఓ సెంచరీతో పాటు 12 హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్, ఈ సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. పంజాబ్‌కి వికెట్ కీపర్‌గానూ వ్యవహారిస్తున్న రాహుల్ రాణిస్తే పంజాబ్ గెలుపు సులభం కానుంది.  ఈ సీజన్‌లో పగ్గాలు తీసుకున్న కెఎల్ రాహుల్, జట్టులో పాజిటివ్ వైబ్రేషన్స్‌ పెంచుతున్నాడు.

రిషబ్ పంత్: క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్లలో రిషబ్ పంత్ ఒకడు. 22 ఏళ్ల ఈ యంగ్ సెన్సేషన్, గత ఐపీఎల్‌లో అదరగొట్టాడు. బుమ్రా వంటి స్టార్ పేసర్లు ఉన్న ముంబై జట్టుపై 27 బంతుల్లో 78 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు రిషబ్ పంత్.

రబాడా: గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లేఆఫ్స్ చేరడంలో రబాడా కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచుల్లో 25 వికెట్లు తీసిన రబాడా, వరల్డ్ కప్ కోసం ముందుగానే స్వదేశానికి వెళ్లిపోవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఫ్లే ఆఫ్ స్టేజీలో రబాడా జట్టులో ఉండి ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ పొజిషన్ మరోలా ఉండేది.

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గత సీజన్‌లో 463 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకునే శ్రేయాస్ అయ్యర్, క్రీజులో నిలదొక్కుకుంటే పంజాబ్‌కి కష్టాలు తప్పవు.

శిఖర్ ధావన్, పృథ్వీషా: ఐపీఎల్ కెరీర్‌లో ‘గబ్బర్’ 4579 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు (524) బాదిన క్రికెటర్ ధావన్. గత సీజన్‌లోనూ 521 పరుగులు చేసిన ధావన్, 5 హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు. యంగ్ సెన్సేషన్ పృథ్వీషా గత సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 353 పరుగులు చేశాడు. 99 పరుగులు వద్ద అవుటైన ప్లేయర్లలో ఒకడిగా ఉన్న పృథ్వీషా, ఈ సీజన్‌లో తన సత్తా చూపించాలని తహతహలాడుతున్నాడు. అయితే ఈ ఇద్దరు ఓపెనర్లకు భారీ షాట్లకు వెళ్లి, వికెట్లను జారవిడుచుకోవడం అలవాటు. దాన్ని అధిగమిస్తే ఢిల్లీకి మంచి ఓపెనర్లు దొరికినట్టే.

loader