MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

KL Rahul: కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

IPL 2025 LSG vs DC: కేఎల్ రాహుల్ మ‌రో సూప‌ర్ నాక్ తో ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విక్ట‌రీ సాధించింది. అభిషేక్ పొరేల్, అక్ష‌ర్ ప‌టేల్ తో క‌లిసి ల‌క్నో టీమ్ కు విన్నింగ్ ప‌రుగులు కొట్టాడు కేఎల్ రాహుల్. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తూ ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2025, 12:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
KL Rahul

KL Rahul

Fastest to 5000 runs in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
KL Rahul IPL records

KL Rahul IPL records

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఢిల్లీ ఆధిపత్యం చూపింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించి, లక్నోను షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేఎల్ రాహుల్, తనను అవ‌మానించిన మాజీ జట్టుపై అద్భుత ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకున్నాడు.

త‌న‌ను తక్కువగా చూసిన ఫ్రాంఛైజీకి, అదే గ్రౌండ్‌లో బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఈ క్ర‌మంలోనే కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో మ‌రో అద్భుత‌మైన రికార్డును సాధించాడు. 

34
Fastest to 5000 runs in IPL KL Rahul

Fastest to 5000 runs in IPL KL Rahul

ల‌క్నో తో జ‌రిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ త‌న 57 ప‌రుగులు ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు, ఆస్ట్రేలియన్ స్టార్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు.  

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు :

1 - కేఎల్ రాహుల్: 130 ఇన్నింగ్స్‌లు 

2 - డేవిడ్ వార్నర్: 135 ఇన్నింగ్స్‌లు

3 - విరాట్ కోహ్లీ : 157 ఇన్నింగ్స్‌లు

4 - ఏబీ డివిలియర్స్: 161 ఇన్నింగ్స్

5 - శిఖర్ ధావన్ : 168 ఇన్నింగ్స్

 

44
KL Rahul (Photo- IPL)

KL Rahul (Photo- IPL)

కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తన మూడవ అర్ధ సెంచరీని సాధించాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ కెరీర్ గమనిస్తే 139 మ్యాచ్ లలో 130 ఇన్నింగ్స్ లను ఆడి 5006 పరుగులు చేశాడు. 46.35 సగటు, 135.71 స్ట్రైక్ రేటుతో అతని బ్యాటింగ్ కొనసాగింది. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 425 ఫోర్లు, 203 సిక్సర్లు బాదాడు.

ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 132 పరుగులు. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో చేరాడు. మళ్లీ 2016లో ఆర్సీబీలోకి వచ్చాడు. గాయం కారణంగా 2017 సీజన్ ను మిస్సయ్యాడు. 2018లో పంజాబ్ టీమ్ లోకి వెళ్లాడు. 2022లో లక్నో టీమ్ కెప్టెన్ గా వరుసగా రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
28 బంతుల్లో సెంచ‌రీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ప్ర‌పంచ క్రికెట్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన 15 ఏళ్ల కుర్రాడు
Recommended image2
Cricket Records: విదేశీ గడ్డపై మనోళ్ల దండయాత్ర.. సచిన్ నుంచి రాహుల్ వరకు అరుదైన రికార్డు ఇదే!
Recommended image3
India A vs Pakistan A: ఫీల్డ్‌లోనే ఫుల్ ఫైర్.. హర్షిత్ రాణాతో పాక్ ప్లేయర్స్ గొడవ, సెంచరీతో ఇచ్చిపడేసిన తిలక్ వర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved