MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • డేవిడ్ వార్నర్ కు గాయం..ఐపీఎల్, టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాడా? లేదా?

డేవిడ్ వార్నర్ కు గాయం..ఐపీఎల్, టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాడా? లేదా?

David Warner : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్.. న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న ద్వైపాక్షిక సీరిస్ లో అద్భుత‌మైన ఆటతో అల‌రిస్తున్నాడు. అయితే, రాబోయే ఐపీఎల్ 2024, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024  కు వార్న‌ర్ భాయ్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
David Warner

David Warner

David Warner injured: ఆస్ట్రేలియా డైనమిక్ ఓపెనర్, స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్నర్ కు గాయం అయింది. దీంతో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే, వార్న‌ర్ గాయం కార‌ణంగా రాబోయే క్రికెట్ సిరీస్ ల‌లో క‌నిపించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

26
David Warner

David Warner

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే నెలలో ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ ముగిసిన త‌ర్వాత టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 జ‌ర‌గనుంది. దీంతో ఈ మెగా టోర్నీల‌లో డేవిడ్ వార్న‌ర్ ఆడుతాడా?  లేదా అనేది చూడాలి.

 

36

కంగారు టీమ్ వ‌ర్గాలు ప్ర‌స్తుతం పేర్కొంటున్న వివ‌రాల ప్ర‌కారం డేవిడ్ వార్న‌ర్ గాయం నుంచి ఐపీఎల్ ప్రారంభ స‌మ‌యం వ‌ర‌కు కోలుకునే అవ‌కాశ‌ముంది. అలా జ‌ర‌గ‌ని క్ర‌మంలో వార్న‌ర్ ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్ ల‌లో ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ, ఈ రెండు మెగా టోర్నీల‌కు అందుబాటులో ఉంటాడ‌నీ, అప్ప‌టివ‌ర‌కు పూర్తి కోలుకుంటాడ‌ని ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ పేర్కొంది.

46
David Warner

David Warner

"వార్నర్‌కు పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది. అత‌ని గాయం ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు, రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని లభ్యతను ప్రభావితం చేయదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
  

56

జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకుంటాన‌ని ఇప్ప‌టికే వార్న‌ర్ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే టెస్టు క్రికెట్, వ‌న్డే  క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని డేవిడ్ వార్న‌ర్ ప్ర‌క‌టించాడు.

66
David Warner

David Warner

అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత క్రికెట్ లీగ్ మ్యాచ్ లలో కొనసాగుతాన‌ని పేర్కొన్నాడు. కాబ‌ట్టి ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నీల‌లో మ‌రి కొంత కాలం పాటు వార్న‌ర్ భాయ్ ఆట‌ను చూడ‌వ‌చ్చు. వార్న‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప‌లుకుతున్న ఇటీవ‌లి స‌మ‌యంలో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తుండ‌టం విశేషం. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
నడిరోడ్డుపైనే అభిషేక్ శర్మకు గంభీర్ క్లాస్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Recommended image2
Shimron Hetmyer : హెట్మెయర్ ఫైర్ కాదు.. అల్ట్రా ఫైర్ ! 14 ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత
Recommended image3
WI vs ZIM : బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.. టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ నయా హిస్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved