ఆలస్యం చేస్తే టీమిండియాకి కూడా వెస్టిండీస్‌కి పట్టిన గతే! ఐపీఎల్ మోజులో పడి...
క్రికెట్ ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన టీమ్ వెస్టిండీస్. మొదటి రెండు వన్డే వరల్డ్ కప్‌లో విశ్వ విజేతగా నిలిచిన వెస్టిండీస్, వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ కూడా సాధించింది. నాలుగు వరల్డ్ కప్స్ గెలిచిన విండీస్, ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించడానికి క్వాలిఫైయర్స్ ఆడుతోంది...

2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన వెస్టిండీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. 1975, 1979 వన్డే వరల్డ్ కప్స్ గెలిచిన వెస్టిండీస్ జట్టు, 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడింది.
భారత జట్టు చేతుల్లో ఓడిన తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ చూపించలేకపోయిన వెస్టిండీస్, వీవ్ రిచర్డ్స్, క్లెవ్ లాయిడ్ వంటి దిగ్గజాలు రిటైర్ అయిన తర్వాత వన్డే, టెస్టు ఫార్మాట్లలో పూర్తిగా వైభవం కోల్పోయింది..
2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వే చేతుల్లో 35 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడి దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. 374 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది విండీస్..
వెస్టిండీస్ జట్టు పతనానికి ప్రధాన కారణం ఫ్రాంఛైజీ క్రికెట్ మీద మోజే. కిరన్ పోలార్డ్, క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, డీజే బ్రావో వంటి విండీస్ దిగ్గజ ప్లేయర్లు, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో లెజెండ్స్‌గా ఎదిగారు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయారు..
Image credit: Getty
ఐపీఎల్‌తో పాటు పాక్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్... ఇలా ప్రపంచంలో ఏ మూలన జరిగే లీగ్ అయినా విండీస్ ప్లేయర్లు ఉండాల్సిందే...
Brandon King
614 టీ20 మ్యాచులు ఆడిన కిరన్ పోలార్డ్, వెస్టిండీస్ తరుపున ఆడింది 123 వన్డేలు, 101 టీ20లే. అంటే వెస్టిండీస్ ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచులు ఆడడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు...
ఆలస్యం చేస్తే టీమిండియాకి కూడా ఇదే పరిస్థితి రావడం ఖాయం. వెస్టిండీస్ అయినా 2016లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అంటే ఆ జట్టు ఐసీసీ టైటిల్ గెలిచి ఏడేళ్లే అవుతోంది. అదే టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి పదేళ్లు దాటిపోయింది..
ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడుతున్న శ్రీలంక కూడా 2014లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ పదేళ్ల గ్యాప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఖరికి న్యూజిలాండ్ కూడా ఐసీసీ టైటిల్ గెలిచేసింది... అంతెందుకు పాకిస్తాన్ కూడా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది..
India vs West Indies
భారత జట్టు 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి కూడా ఫ్రాంఛైజీ క్రికెట్టే కారణం. చెప్పుకోవడానికి ఐపీఎల్ రెండు నెలల లీగ్ మాత్రమే. అయితే టీమిండియా తరుపున ఏ ప్లేయర్ ఆడాలి? ఏ ప్లేయర్ ఆడకూడదు? అనే విషయాలను కూడా ఫ్రాంఛైజీలే డిసైడ్ చేస్తున్నాయి..
అందుకే దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లకు టీమిండియాలో చోటు దక్కడం లేదు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా ఐపీఎల్‌లో ఆడుతున్నారనే కారణంగా రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లకు అవకాశాలు దక్కుతున్నాయి..
వేల కోట్ల ఆదాయాన్ని, లక్ష కోట్ల మార్కెట్‌ని ఏర్పరచుకున్న ఐపీఎల్‌ని నియంత్రించే పొజిషన్‌లో ఇప్పుడు బీసీసీఐ కూడా లేదు. వాస్తవానికి ఆ స్టేజీ ఎప్పుడో దాటేసింది ఐపీఎల్. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలే, బీసీసీఐని ఆడిస్తున్నాయి..
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా గెలవకపోతే.. ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు వస్తాయి. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఎప్పటిలాగే ఐపీఎల్ క్రేజ్ మరింత పెరుగుతుంది... బీసీసీఐకి కాసుల పంట పండుతుంది. బోర్డుకి కావాల్సింది కూడా అదే కదా..