- Home
- Sports
- Cricket
- ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌కు మరో చారిత్రాత్మక గుర్తింపు.. ఐపీఎల్‌లో వెయ్యో మ్యాచ్‌లో తలపడబోతున్న దిగ్గజ టీమ్స్
‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌కు మరో చారిత్రాత్మక గుర్తింపు.. ఐపీఎల్‌లో వెయ్యో మ్యాచ్‌లో తలపడబోతున్న దిగ్గజ టీమ్స్
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మార్చి 31న మొదలుకానుంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సీజన్ మరో మైలురాయికి చేరువకాబోతుంది.

ఐపీఎల్‌లో 16వ సీజన్ జోష్ మొదలైంది. శుక్రవారం ఐపీఎల్-16 షెడ్యూల్ ను బీసీసీఐ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో టీవీలలో నిన్న (శనివారం) ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా మొదలైన విషయం తెలిసిందే. మార్చి 31 న మొదలై మే 28 వరకూ సాగే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సాగనుంది.
15 ఏండ్లుగా భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్న ఈ లీగ్ 2023వ సీజన్ లో మరో మైలురాయిని చేరుకోబోతున్నది. 16వ సీజన్ లో ఈ లీగ్ లో వెయ్యో మ్యాచ్ జరుగనుంది. మే 06న ఐపీఎల్ లో ఈ అరుదైన మైలురాయిని చేరుకుంటుంది.
యాధృశ్చికమో లేక మరేదో గానీ ఈ ప్రతిష్టాత్మక మైలురాయి రెండు దిగ్గజ జట్ల మధ్యనే జరుగుతుండటం విశేషం. ఐపీఎల్ లో మోస్టగ్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్యే జరుగుతుండటం గమనార్హం. మే 06న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబై - చెన్నై మధ్య వెయ్యో మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లను ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. మిగతా జట్లు ఎన్ని మ్యాచ్ లు ఆడినా ఎంత ఉత్కంఠతో కూడిన ఆట ఆడినా ముంబై-చెన్నై మధ్య జరిగే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ రాదు. ఐపీఎల్ లో ఇప్పటివరకూ 15 సీజన్లు ముగిస్తే అందులో తొమ్మిది.. చెన్నై నాలుగు, ముంబై ఐదు టైటిల్స్ తో ముందున్నాయి.
ఇక ఈ రెండు దిగ్గజ జట్లమధ్య ద నాలుగు సార్లు ఫైనల్స్ జరిగాయి. 2010, 2013, 2015, 2019 లలో ముంబై - చెన్నై ఫైనల్స్ లో తలపడ్డాయి. 2010లో చెన్నై విజయం సాధించగా తర్వాత మూడు సార్లూ ముంబైదే విజయం. కానీ గత సీజన్ లో ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. మరి ఈ సీజన్ లో ఏం చేస్తాయో చూడాలి.
చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ లో ఇదే ఆఖరి సీజన్. 2008 నుంచి చెన్నైకి సారథిగా వ్యవహరిస్తున్న ధోని.. వాస్తవానికి గతేడాదే ఈ లీగ్ కు గుడ్ బై చెప్పాలని చూశాడు. అదే క్రమంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చినా అతడు టీమ్ ను విజయవంతంగా నడిపించలేదు. దీంతో మళ్లీ టోర్నీ మధ్యలోనే ధోని సారథ్య పగ్గాలు అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో చెన్నై చతికిలపడింది. ఈ సీజన్ లో ధోనికి ఫేర్వెల్ ఇవ్వడానికి ఆ జట్టు గట్టిగానే ప్రిపేర్ అయి వస్తున్నట్టు తెలుస్తున్నది.