- Home
- Sports
- Cricket
- పూజారాను కొనడం వెనక ఇంత మాస్టర్ ప్లాన్ దాగి ఉందా... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు...
పూజారాను కొనడం వెనక ఇంత మాస్టర్ ప్లాన్ దాగి ఉందా... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు...
ఐపీఎల్ 2021 వేలంలో ఎవ్వరూ ఊహించని విధంగా టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని బేస్ ప్రైజ్ రూ.50 లక్షల వద్ద కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఏడేళ్లుగా ఐపీఎల్‌కి దూరంగా గడిపిన పూజారా, ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే పూజారా కొనుగోలు వెనకాల పెద్ద మాస్టర్ ప్లానే ఉందంటున్నారు విశ్లేషకులు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఇప్పటికే అర్హత సాధించింది న్యూజిలండ్. మిగిలిన ఫైనల్ బెర్త్‌ను ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే టెస్టు సిరీస్ ఫలితం తేల్చనుంది. అయితే టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ముందు జరిగే ఐపీఎల్‌లో దీని గురించి వ్యూహాలు జరిగాయని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కి రోహిత్ శర్మపై మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న ట్రెంట్ బౌల్ట్, నెట్ సెషన్స్‌లో రోహిత్ శర్మకు బౌలింగ్ చేయాల్సి ఉంది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ప్రాక్టీస్ ఉపయోగపడే అవకాశం ఉంది...

అలాగే స్టీవ్ స్మిత్‌పై రవిచంద్రన్ అశ్విన్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటిదాకా స్మిత్‌ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్లలో అశ్విన్ ఒకడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌ను స్మిత్‌ను మొట్టమొదటిసారి డకౌట్ చేశాడు అశ్విన్..

స్టీవ్ స్మిత్ సమస్యను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అతన్ని డీసీ కొనుగోలు చేసేలా చేశాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేసి స్మిత్, ఈ సమస్య నుంచి బయటపడతాడని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

అలాగే న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్‌ను రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చిన్నస్వామి స్టేడియంలో జెమ్మీసన్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసే విరాట్ కోహ్లీ, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతన్ని సమర్థవంతంగా ఫేస్ చేస్తాడని విశ్లేషకుల అభిప్రాయం...

అదేవిధంగా న్యూజిలాండ్ క్రికెట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో టెస్టు ప్లేయర్ పూజారాను కొనుగోలు చేసిన ఫ్లెమింగ్, ఈ విధంగా అతను కౌంట్రీ క్రికెట్ ఆడకుండా చేశాడు...

ఐపీఎల్ 2021లో భాగమైన పూజారాకు మ్యాచులు ఆడేందుకు పెద్దగా అవకాశం రాకపోవచ్చు. వచ్చినా టీ20 ఫార్మాట్ కాబట్టి పూజారా ఫెవరెట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉండదు. కాబట్టి టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌కి ముందు పూజారాకి కావాల్సినంత ప్రాక్టీస్ ఉండదు...

అందుకే టెస్టు ప్లేయర్‌ను కొనేందుకు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తి చూపించాడని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.

అయితే ఇదంతా వర్కవుట్ కావాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. రెండింట్లో ఒక్క మ్యాచ్ ఓడినా, టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించలేదు.

లాక్‌డౌన్ కారణంగా 8 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న ఛతేశ్వర్ పూజారా, ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ పాల్గొనలేదు. దీంతో ఆస్ట్రేలియా టూర్‌లో రిథమ్ అందుకోవడానికి చాలా సమయం తీసుకున్న విషయం తెలిసిందే.