క్రికెటర్ శ్రీశాంత్ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడా... పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ హీరోయిన్లతో కూడా...

First Published Feb 12, 2021, 6:45 PM IST

క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఓ మాస్ మసాలా కమర్షియల్ థ్రిల్లర్ మూవీకి సమానంగా ఉంటుంది. కావాల్సినన్ని ట్విస్టులు, ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి శ్రీశాంత్ జీవితంలో... స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్, సినిమాలు, రాజకీయాలు, టీవీ షోలు... ఇలా అన్ని రంగాల్లోనూ ప్రయత్నాలు చేశాడు. కొన్ని రంగాల్లో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దూకుడైన వ్యక్తిత్వం కలిగిన శ్రీశాంత్, 37 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ మినీ వేలంలో చోటు దక్కించుకోలేకపోయినా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని ప్రకటించిన శ్రీశాంత్ మంచి రొమాంటిక్ పర్సన్ కూడా..