- Home
- Sports
- Cricket
- ఏమయ్యా మిశ్రా! మత్తులో ఉండి, ట్వీట్ వేశావా... సెంచూరియన్ టెస్టు విజయంపై అమిత్ మిశ్రా ట్వీట్‌పై...
ఏమయ్యా మిశ్రా! మత్తులో ఉండి, ట్వీట్ వేశావా... సెంచూరియన్ టెస్టు విజయంపై అమిత్ మిశ్రా ట్వీట్‌పై...
మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన భారత క్రికెటర్ అమిత్ మిశ్రా... ట్రోలింగ్ వస్తున్నా, ట్వీట్‌ను డిలీట్ చేయని వైనం...

సౌతాఫ్రికా టూర్‌ను విజయంతో ఆరంభించింది టీమిండియా. 19 ఏళ్లుగా విజయాన్ని అందుకోలేకపోయిన సెంచూరియన్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి, బోణీ కొట్టింది. అయితే ఈ విజయంపై అమిత్ మిశ్రా వేసిన ట్వీట్ ట్రోలింగ్‌కి కారణమవుతోంది...
సౌతాఫ్రికాలో ఇప్పటిదాకా జరిగిందే ఒ్క సిరీస్ అయితే అమిత్ మిశ్రా, టెస్టు సిరీస్ గెలిచినందుకు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు...
‘కంగ్రాట్స్ టీమిండియా. చాలా బాగా ఆడారు. సౌతాఫ్రికాలో మొదటి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించారు. గర్వంగా ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత క్రికెటర్ అమిత్ మిశ్రా...
మనిషి అన్నాక పొరపాట్లు చేయడం సహజం. అయితే చేసిన పొరపాటు సరిదిద్దుకుంటే విమర్శలు తగ్గుతాయి... అయితే అమిత్ మిశ్రా మాత్రం తన ట్వీట్‌పై విపరీతమైన ట్రోలింగ్, కామెంట్లు వస్తున్నా దాన్ని డిలీట్ చేయకపోవడం విశేషం...
అమిత్ మిశ్రా ఏం బ్రాండ్ తాగుతున్నాడో కనుక్కోవాలని... మద్యం మత్తులో ఏం ట్వీట్ చేస్తున్నాడో కూడా తెలియకుండా ట్వీట్లు వేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే అమిత్ మిశ్రాకి ఇలా తప్పుడు ట్వీట్లు చేయడం, తొందరపాటు ట్వీట్లు చేయడం కొత్తేమీ కాదు...
ఇంతకుముందు కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలిస్తే, న్యూజిలాండ్ జట్టు టైటిల్ గెలిచినందుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు అమిత్ మిశ్రా...
అమిత్ మిశ్రా పొరపాట్లు, షెడ్యూల్ ట్వీట్ల వల్ల జరుగుతోందని అంటున్నారు మరికొందరు. న్యూజిలాండ్ టైటిల్ గెలుస్తుందని భావించి, అప్పుడు... టీమిండియా టెస్టు సిరీస్ గెలుస్తుందని ఇప్పుడు అంచనా వేసి, ట్వీట్లను షెడ్యూల్ చేసి ఉంటాడని... అయితే డేట్ మారడంతో ఇలా దొరికిపోయాడని అంచనా వేస్తున్నారు...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తర్వాత అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...
‘ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఇలా జరిగింది. టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడి, జట్టులో ప్లేస్ దక్కించుకున్నాక అద్భుతంగా రాణించిన తర్వాత చెప్పాపెట్టకుండా టీమ్‌లో నుంచి తీసేసేవాళ్లు... టీమ్‌లో ప్లేస్ కోసం ఎన్నో కష్టాలను అనుభవించిన ప్లేయర్లకు, తమ పర్పామెన్స్ బాగున్నా ఎందుకని జట్టులో నుంచి తీసేశారో తెలియాల్సిన హక్కు ఉంది..
మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత కూడా జట్టులో నుంచి, ఆ పొజిషన్‌లో నుంచి ఎందుకు తీసేశారో తెలిస్తే, ఆ విభాగంలో మెరుగయ్యేందుకు దృష్టి పెట్టేందుకు అవకాశం దొరుకుతుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు అమిత్ మిశ్రా...
అమిత్ మిశ్రా చేసిన కామెంట్లు, తన గురించి చేసినవేనని అతని రికార్డులు చూస్తే తెలుస్తుంది... 2016లో వన్డేల్లో న్యూజిలాండ్‌పై 5 మ్యాచుల్లో 15 వికెట్లు తీసిన తర్వాత కూడా అమిత్ మిశ్రాకు మరో అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు...
అలాగే 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచులో 3 వికెట్లు తీసిన తర్వాత కూడా అమిత్ మిశ్రాను తీసి పక్కనబెట్టేశారు టీమిండియా సెలక్టర్లు...
39 ఏళ్ల అమిత్ మిశ్రా, భారత జట్టు తరుపున 22 టెస్టు మ్యాచులు ఆడి 76 వికెట్లు తీశాడు. 36 వన్డేల్లో 64 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 8 టీ20 14 వికెట్లు పడగొట్టాడు...
ఐపీఎల్‌లో 166 వికెట్లతో లసిత్ మలింగ (170 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్న అమిత్ మిశ్రాకి టీమిండియాలో తగినన్ని అవకాశాలు దక్కలేదు...
39 ఏళ్ల వయసులోనూ రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 152 మ్యాచులు ఆడి 535 వికెట్లు తీశాడు. అతేకాకుండా 4176 పరుగులు కూడా చేశాడు...