MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌ 2022కి దూరంగా క్రిస్ గేల్... ఈ స్టార్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ కనిపించరు...

ఐపీఎల్‌ 2022కి దూరంగా క్రిస్ గేల్... ఈ స్టార్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ కనిపించరు...

ఐపీఎల్ 2022 సీజన్‌కి స్టార్ కళ తప్పేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి ఒకానొక కారణమైన ‘యూనివర్సల్ బాస్’, వెస్టిండీస్ వీరబాదుడు వీరుడు క్రిస్ గేల్ ఈసారి ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Feb 03 2022, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం కోసం మొత్తంగా 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. వీరిలో 896 మంది భారత క్రికెటర్లు కాగా, 318 మంది విదేశీ ప్లేయర్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

క్రిస్ గేల్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్, జో రూట్... ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు...

39

గత 14 సీజన్లలో పాల్గొన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం...

49

‘క్రిస్ గేల్, ఐపీఎల్ 2022 వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు. అంటే గేల్‌ని మనం ఇకపై ఐపీఎల్‌లో చూడలేం. అతనో అద్భుతమైన ప్లేయర్...

59

ఐపీఎల్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి గేల్ కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ అందించిన సేవలకు నిలబడి, చప్పట్లతో అభినందించాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు కామెంటేటర్ హర్షా భోగ్లే..

69

యాషెస్ సిరీస్‌ 2021-22లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడడం వల్లే టెస్టుల్లో సరిగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారని ట్రోల్స్ వచ్చాయి...

79

దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్... ఐపీఎల్‌కి దూరంగా ఉండబోతున్నారు. జోఫ్రా ఆర్చర్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు...

89

అయితే బెయిర్ స్టోతో పాటు టామ్ కుర్రాన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోతున్నారు...

99

ఆఫ్ఘాన్‌తో పాటు నేపాల్, సింగపూర్, యూఏఈ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ దేశాలకు చెందిన ఒక్కో క్రికెటర్ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...
 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Recommended image2
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image3
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved