Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • రిటైర్ అయ్యేలోపు ఆ ఒక్క టైటిల్ గెలవాలి... మనసులో మాట బయపెట్టిన ఛతేశ్వర్ పూజారా...

రిటైర్ అయ్యేలోపు ఆ ఒక్క టైటిల్ గెలవాలి... మనసులో మాట బయపెట్టిన ఛతేశ్వర్ పూజారా...

కౌంటీల్లో సుసెక్స్ క్లబ్ తరుపున పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు ఛతేశ్వర్ పూజారా. జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించే ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్‌లో మాత్రం ధనాధన్ షాట్లతో, మెరుపు సిక్సర్లతో స్కోరు బోర్డును ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్, రాయల్ లండన్ వన్డే కప్ కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పూజారా, త్వరలో వన్డే టీమ్‌లోనూ చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు...  

Chinthakindhi Ramu | Published : Aug 26 2022, 12:31 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
pujara

pujara

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 8 మ్యాచులు ఆడి 5 సెంచరీలు, అందులో 3 డబుల్ సెంచరీలతో 1094 పరుగులు చేశాడు ఛతేశ్వర్ పూజారా. ప్రస్తుతం రాయల్ లండన్ వన్డే కప్‌లో సుసెక్స్ క్లబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పూజారా, 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు...

28
Cheteshwar Pujara

Cheteshwar Pujara

టెస్టుల్లో 80+ బంతులు ఆడిన తర్వాత సింగిల్ తీసిన సందర్భాలు కూడా పూజారా కెరీర్‌లో చాలా ఉన్నాయి. అలాంటి పూజారా, రాయల్ లండన్ కప్‌లో 100+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తూ... ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు...

38
Asianet Image

ఇప్పటి దాకా రాయల్ లండన్ వన్డే కప్ 2022లో 8 మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా 116.28 స్ట్రైయిక్ రేటుతో 102.33 సగటుతో 614 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి... వార్‌విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగులు చేసిన పూజారా, మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 బంతుల్లో 132 పరుగులు చేశాడు...
 

48
Cheteshwar Pujara

Cheteshwar Pujara

ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా టూర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఛతేశ్వర్ పూజారా, పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. రంజీ మ్యాచుల్లో ఆడి ఫామ్ నిరూపించుకున్నాకే తిరిగి భారత జట్టు తరుపున ఆడాలని పూజారా, రహానేలకు స్పష్టం చేసింది బీసీసీఐ...

58
Cheteshwar Pujara

Cheteshwar Pujara

అజింకా రహానే పెద్దగా పర్ఫామెన్స్ చేయలేకపోయినా ఛతేశ్వర్ పూజారా అటు రంజీల్లో అదరగొట్టి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అయితే బెదరగొట్టే పర్పామెన్స్ ఇచ్చి... టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. కెరీర్ పీక్ ఫామ్‌లో కొనసాగుతున్న పూజారా, సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.. 

68
Asianet Image

‘మీ కెరీర్‌లో మీకున్న లక్ష్యం ఏంటి?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఎప్పుడూ వాస్తవంలో జీవించడానికే ప్రాధాన్యం ఇస్తాను. భవిష్యత్తు గురించి పెద్దగా ఆశలు కానీ లక్ష్యాలు కానీ పెట్టుకోను. అయితే రిటైర్ అయ్యేలోపు ఒక్కసారి అయినా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవాలని ఉంది...’ అంటూ సమాధానం ఇచ్చాడు ఛతేశ్వర్ పూజారా...

78
Cheteshwar Pujara

Cheteshwar Pujara

అలాగే ‘ఇప్పటిదాకా మీరు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఏది?’ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు... ‘2017, బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 92 పరుగులు...’  అంటూ సమాధానం ఇచ్చాడు ఛతేశ్వర్ పూజారా...

88
Rahane-Pujara

Rahane-Pujara

2017 బెంగళూరు టస్టులో 221 బంతుల్లో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా. అభినవ్ ముకుంద్ అవుటైన తర్వాత కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో మంచి పార్టనర్‌షిప్స్ నెలకొల్పాడు. అజింకా రహానేతో కలిసి 118 పరుగులు జోడించిన పూజారా, భారత జట్టు 274 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ 6 వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను 188 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
WTC:  విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
WTC: విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
RCB: అమ్మ‌కానికి ఆర్సీబీ జ‌ట్టు.. ధ‌ర ఎంత‌.? ఎందుకు అమ్మ‌నున్నారంటే
RCB: అమ్మ‌కానికి ఆర్సీబీ జ‌ట్టు.. ధ‌ర ఎంత‌.? ఎందుకు అమ్మ‌నున్నారంటే
TNPLలో మహిళా అంపైర్ పై అశ్విన్ ఫైర్.. ఏం జరిగిందంటే?
TNPLలో మహిళా అంపైర్ పై అశ్విన్ ఫైర్.. ఏం జరిగిందంటే?
Top Stories
WTC - విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
WTC - విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
Andhra Pradesh: తల్లికి వందనం పథకం.. ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు హాంఫట్‌!
Andhra Pradesh: తల్లికి వందనం పథకం.. ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు హాంఫట్‌!
Cricket:  Ms Dhoni మరో అరుదైన ఘనత..ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లోకి ఎంట్రీ!
Cricket: Ms Dhoni మరో అరుదైన ఘనత..ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లోకి ఎంట్రీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved