రోహిత్ చెప్పగానే సిక్సర్ బాదిన ఛతేశ్వర్ పూజారా... అశ్విన్ మీసం గీయించుకుంటాడా?...
సంప్రదాయ టెస్టు క్రికెట్‌కి తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ ఛతేశ్వర్ పూజారా. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయే పూజారా, అటు బౌలర్ల సహనానికి, ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడతాడు. అలాంటి పూజారా, టెస్టుల్లో సిక్సర్ బాదడం చాలా అరుదైన విషయం...

Cheteshwar Pujara
13 ఏళ్ల క్రితం టెస్టు కెరీర్ ప్రారంభించిన ఛతేశ్వర్ పూజారా, ఇప్పటిదాకా తన కెరీర్‌లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 16 మాత్రమే. అప్పుడెప్పుడో 2012లో కేన్ విలియంసన్ బౌలింగ్‌లో తొలి సిక్సర్ బాదిన పూజారా, 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో అజాజ్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు...
Cheteshwar Pujara
జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయి, కౌంటీల్లో ఫామ్ నిరూపించుకుని తిరిగొచ్చిన ఛతేశ్వర్ పూజారా... ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
అయితే రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకుపోయిన పూజారా, 142 బంతులను ఎదుర్కొని 59 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌కి అత్యంత క్లిష్టంగా ఉన్న పిచ్‌పైన పూజారా చేసిన ఈ పరుగులు చాలా అమూల్యమైనవి...
పూజారా నెమ్మదిగా ఆడుతుండడంతో డగౌట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, షాట్స్ ఆడాల్సిందిగా వాటర్ బాయ్ ఇషాన్ కిషన్‌తో మెసేజ్ పంపించాడు. ఆ సమయంలో పూజారాకి అవతలి ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్ షాట్స్ ఆడతాడేమోనని అనుకున్నారు అంతా...
Cheteshwar Pujara
అయితే నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి ఓ భారీ సిక్సర్ బాదాడు ఛతేశ్వర్ పూజారా. పూజారా ఇలాంటి షాట్ ఆడడం చూసి అందరూ షాక్ అయ్యారు. రోహిత్ చెప్పడం వల్లే పూజారా ఈ షాట్ ఆడినట్టు అందరికీ అర్థమైంది..
Cheteshwar Pujara
అయితే క్రీజులో కుదురుకుని బాగా ఆడుతున్న పూజారా, రోహిత్ మెసేజ్ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ కుదురుకుపోవడంతో పూజారా ఇంకో గంట సేపు బ్యాటింగ్ చేసి టీమిండియా 100+ లక్ష్యాన్ని ఇచ్చి ఉండేది...
Ravichandran Ashwin
అయితే 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ‘కుట్టీ స్టోరీస్’ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్‌లో వరుస వీడియోలు చేశాడు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ సమయంలో పూజారా, ఫ్రంట్‌ఫుట్‌కి వచ్చి సిక్సర్ బాదితే తాను అర మీసంతో కనిపిస్తానని ఛాలెంజ్ చేశాడు..
ఇప్పుడు ఛతేశ్వర్ పూజారా అదే పని చేశాడు. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి మరీ సిక్సర్ కొట్టాడు. మరి రవిచంద్రన్ అశ్విన్ మాట మీద నిలబడి, అరమీసంతో కనిపిస్తాడా? అని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు..