MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మళ్లీ సున్నా చుట్టిన ఛతేశ్వర్ పూజారా... సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు రాకపోతే ఇక ప్లేస్ కష్టమే...

మళ్లీ సున్నా చుట్టిన ఛతేశ్వర్ పూజారా... సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు రాకపోతే ఇక ప్లేస్ కష్టమే...

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీ బ్రేక్ విరామానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 26 2021, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ముంబై టెస్టులో భారీ సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, దాన్ని కొనసాగిస్తూ 123 బంతుల్లో 9 ఫోర్లతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్‌తో 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత లుంగి ఇంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు మయాంక్ అగర్వాల్...

310

మయాంక్ అగర్వాల్ అవుటైన క్రీజులోకి వచ్చిన ఛతేశ్వర్ పూజారా, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో మొదటి బంతికే కీగన్ పీటర్సన్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

410

సౌతాఫ్రికాలో డకౌట్ కావడం ఛతేశ్వర్ పూజారాకి ఇది రెండోసారి. ఇంతకుముందు 2018 పర్యటనలోనూ సెంచూరియన్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు పూజారా...

510

1992లో సంజయ్ మంజ్రేకర్, 1996లో సౌరవ్ గంగూలీ... సౌతాఫ్రికాలో టెస్టుల్లో మూడో స్థానంలో వచ్చి డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉండగా... పూజారా రెండుసార్లు ఈ చెత్త రికార్డు సాధించాడు...

610

2018 ఏడాదిలో మూడు సార్లు డకౌట్ అయిన పూజారా, 2021లోనూ మూడోసారి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 2018లో సెంచూరియన్‌లో గోల్డెన్ డకౌట్ అయిన పూజారా, మళ్లీ అక్కడే మొదటి బంతికే అవుటై పెవిలియన్ చేరడం విశేషం...

710

భారత జట్టు తరుపున అత్యధిక సార్లు డకౌట్ అయిన వన్‌డౌన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు పూజారా. దిలిప్ వెంగ్‌సర్కార్ 8 సార్లు, రాహుల్ ద్రావిడ్ 7 సార్లు టెస్టుల్లో డకౌట్ కాగా, పూజారాకి ఇది 9వ డకౌట్...

810

ఆస్ట్రేలియా టూర్‌‌‌లో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ తర్వాత 21 ఇన్నింగ్స్‌లు ఆడిన ఛతేశ్వర్ పూజారా, 23.90 సగటుతో 478 పరుగులు చేశాడు. ఇందులో కేవలం మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. 

910

ఇప్పటికే పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో కూడా పరుగులు చేయలేకపోతే... రెండో టెస్టులో టీమ్‌లో చోటు దక్కించుకోవడం కష్టమే...

1010

శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ప్రియాంక్ పంచల్ వంటి ప్లేయర్లు తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూస్తుండడంతో రహానే, పూజారాలపై వేటు వేసేందుకు ఛాన్స్‌లు పెరుగుతున్నాయి.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...
Recommended image2
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Recommended image3
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved