భారీ టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసిన సీఎస్‌కే... సన్‌రైజర్స్‌కి ఐదో ఓటమి...

First Published Apr 28, 2021, 10:57 PM IST

IPL 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదో ఓటమి మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగుల భారీ స్కోరు చేసినా...  ఓపనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో ఈజీ విక్టరీ సాధించింది సీఎస్‌కే... సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడితే, ఐదింట్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు సీఎస్‌కే ఈ విజయంతో మళ్లీ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది.