MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Tushar Deshpande : స్కూల్ క్రష్‌ను పెళ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్..

Tushar Deshpande : స్కూల్ క్రష్‌ను పెళ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్..

Tushar Deshpande Marriage: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్ పాండే తన 'స్కూల్ క్రష్' నభా గడ్డంవార్ తో జతకట్టాడు. జూలైలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా, తాజాగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు వైర‌ల్ గా మారాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 22 2023, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

CSK star Tushar Deshpande Marriage: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ తుషార్ దేశ్ పాండే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త‌న స్కూల్ క్ర‌ష్ తుషార్ నభా గడ్డంవార్ ను జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. సీఎస్కే ఆటగాడు తుషార్ పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదిక‌గా అభిమానులతో పంచుకున్నాడు. తుషార్ వివాహానికి దగ్గరి బంధువులతో పాటు కొందరు స్నేహితులను హాజ‌ర‌య్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

మీడియా కథనాల ప్రకారం.. తుషార్, నభాలు స్కూల్ డేస్ నుంచి ఒకరికొకరు తెలుసు. ఆ తర్వాత కాలేజీలో కూడా కలిసి చదువుకున్నారు. స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. 
 

34
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

పెళ్లి ఫొటోలను తుషార్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. డిసెంబర్ 21న వీరిద్దరి వివాహం జరిగింది. జూన్ 12న వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక నభా విషయానికొస్తే ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ గా ఉంటుంది. ఆమె తుషార్ స్కూల్ క్రష్ అనీ, చాలా ఏళ్ల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని  సమాచారం.
 

44
Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

Tushar Deshpande Marriage, Nabha Gaddamwar

తుషార్ చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో కీలక బౌలర్. జట్టు తరఫున పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. దేశవాళీ మ్యాచుల్లో కూడా తుషార్ కు మంచి రికార్డు ఉంది. ఇక తుషార్ ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 23 మ్యాచ్ ల‌ను ఆడాడు. ఇందులో 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్  మ్యాచ్ లో తుషార్ అత్యుత్తమ ప్రదర్శన 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం. తుషార్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 81 వికెట్లు పడగొట్టాడు. 40 లిస్ట్ ఏ మ్యాచ్ ల‌లో 51 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఆడిన 67 టీ20 మ్యాచ్ ల‌లో 99 వికెట్లు పడగొట్టాడు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved