MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MS Dhoni: కోలివుడ్ లోకి ధోని ఎంట్రీ.. నయనతారతో సినిమా చేయనున్న సీఎస్కే కెప్టెన్.. రజినీకాంత్ కూ హస్తం..?

MS Dhoni: కోలివుడ్ లోకి ధోని ఎంట్రీ.. నయనతారతో సినిమా చేయనున్న సీఎస్కే కెప్టెన్.. రజినీకాంత్ కూ హస్తం..?

Nayanathara-Dhoni Movie: టీమిండియా మాజీ, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్నంత అభిమానగణం ధోనికి కూడా ఉంది.

2 Min read
Author : Srinivas M
| Updated : May 11 2022, 10:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మహేంద్ర సింగ్ ధోని తమిళ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా గడుపుతున్న ధోని.. అది ముగిసిన వెంటనే కోలివుడ్ లోకి అరంగేట్రం చేయడం ఖాయమే అంటున్నారు తాలా ఫ్యాన్స్. 

28

ప్రముఖ నటి, త్వరలోనే తమిళ యువ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్న  లేడీ సూపర్ స్టార్ నయనతార తో కలిసి ధోని తమిళ సినీ రంగంలో కాలు మోపబోతున్నాడని కోలివుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. 

38

అయితే ధోని  తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేది నటుడిగా కాదు.  నిర్మాతగా.. . ధోని తమిళంలో నిర్మించబోయే తొలి సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించనుంది. మహిళా కథ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా సినిమాకు  ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

48

ఈ సినిమాను ధోని.. రజినీకాంత్ దగ్గర చాలాకాలం పాటు  పనిచేసిన సంజయ్ ను అసోసియేట్ గా నియమించుకున్నాడు. ఈ చిత్ర బాధ్యతలను మొత్తం  అతడే దగ్గరుండి చూసుకుంటున్నాడు.

58

మరి ఈ సినిమాలో రజినీ కూడా నటిస్తాడా..?  అని కూడా కోలివుడ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ధోని కూడా రజినీకాంత్ అభిమానే. ధోని అడిగితే  కీలక పాత్రలో నటించడానికి కూడా  సూపర్ స్టార్ కాదనకుండా ఉంటాడా..? అది కూడా తనకెంతో  కావాల్సిన సంజయ్  మార్గ నిర్దేశనలో తెరకెక్కుతున్న  చిత్రం కాబట్టి రజినీ కూడా  నటించడానికే మొగ్గు చూపే అవకాశముంది. 

68

ధోని ప్రస్తుతం ఐపీఎల్ వల్ల  ముంబై లో బిజిగా గడుపుతున్నాడు.  ఇప్పటికే ప్లేఆఫ్  ఆశలు వదిలేసుకున్న చెన్నై మరో రెండు  మ్యాచులు ఆడి సీజన్ ను ముగుస్తుంది.  మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో షూటింగ్ కొనసాగుతున్న సినిమా కూడా ఉంది. 

78
Nayanathara

Nayanathara

ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు   తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

88

నయన్ పెళ్లి, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కిలిసి  ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ  మేరకు విజయం సాధిస్తాడో  వేచి చూడాలి.  

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image2
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Recommended image3
IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved