MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • పెళ్లికి మూడేళ్ల ముందు నుంచే సాక్షితో మాహీ ప్రేమాయణం... మన బంధానికి 14 ఏళ్లంటూ...

పెళ్లికి మూడేళ్ల ముందు నుంచే సాక్షితో మాహీ ప్రేమాయణం... మన బంధానికి 14 ఏళ్లంటూ...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాస్ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కేకి నాలుగో టైటిల్ అందించిన మాహీ, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా వ్యవహరించాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Dec 19 2021, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మాహీకి జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటే, సోషల్ మీడియాలో మాహీ కంటే ఆయన సతీమణి సాక్షి సింగ్‌కే క్రేజ్ ఎక్కువ. ఐపీఎల్‌లోనూ సాక్షి సందడి కనిపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తాజాగా సాక్షి సింగ్ చేసిన పోస్టును బట్టి చూస్తే, మాహీకి సాక్షికీ పెళ్లికి ముందు మూడేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది....

310

ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలు ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న మహీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యాడు...

410

జైపూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో మాహీతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన సాక్షి, ‘చీర్స్... మనం ఒకరికొకరం తెలిసి 14 ఏళ్లు అవుతోంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది...

510

2010లో సాక్షి సింగ్‌ను వివాహం చేసుకున్నాడు మాహీ. 14 ఏళ్లంటే అంతకుముందు మూడేళ్ల క్రితమే అంటే 2007లో ధోనీ, సాక్షి సింగ్‌ల మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది... 

610

ఐపీఎల్ 2021 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, తన రేంజ్‌కి తగ్గ ఒక్కటంటే ఒక్క పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు... బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు...

710

అదీకాకుండా పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఆవేశ్ ఖాన్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్‌ల బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

810

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన మాహీ ఇన్నింగ్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ధోనీ భార్య సాక్షి సింగ్. 19 పరుగులు కావాల్సిన దశలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌కి ఎగిరి గంతేసి, పక్కనే ఉన్న సీఎస్‌కే సపోర్టర్‌ను హత్తుకుంది సాక్షి సింగ్...

910

ఆ తర్వాతి ఓవర్‌లో వరుస ఫోర్లు కొడుతూ, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. విన్నింగ్ షాట్ కొట్టిన సమయంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది సాక్షి సింగ్...

1010

సాక్షి సింగ్ రెండోసారి గర్భం దాల్చిందని, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయానికే నాలుగు నెలల కడుపుతో ఉందని ప్రియాంక రైనా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు చూస్తుంటే, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved