- Home
- Sports
- Cricket
- Champions Trophy IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Champions Trophy IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Champions Trophy IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

India vs Australia
IND vs AUS Champions Trophy Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆదివారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. వరుస విజయాలతో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ దశను అద్భుతంగా ముగించింది. గ్రూప్ ఏ లో మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి టాప్ లో నిలిచింది. అలాగే, గ్రూప్ బీలో ఇంగ్లాండ్‌పై ఒక విజయంతో పాటు మరో రెండు మ్యాచ్ లు వర్షంతో రద్దు కావడంతో మొత్తం 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ జరగనుంది? భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీస్ ఎక్కడ, ఎప్పుడు జరగనుంది?
మార్చి 4న దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ 1 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ మధ్యాహ్నం 2:00 గంటలకు వేస్తారు. ఇండియా-ఆసీస్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
IND vs AUS Match
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-ఆసీస్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ 1 మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో వివిధ భాషల కామెంటరీతో చూడవచ్చు. అలాగే, స్పోర్ట్స్ 18 లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇండియా vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్ ను ఆన్‌లైన్‌లో జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల కామెంటరీతో లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు. మరిన్ని తాజా ఆప్ డేట్స్ కోసం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో కూడా చూడవచ్చు.
India vs Australia
భారత్ vs ఆస్ట్రేలియా: వన్డేల్లో హెడ్ టు హెడ్ రికార్డు ఎలా ఉన్నాయి?
భారత్, ఆస్ట్రేలియా వన్డేల్లో 151 సార్లు తలపడ్డాయి. భారత్ 57 సార్లు గెలిచింది, ఆస్ట్రేలియా 84 సార్లు గెలిచింది. 10 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భారత్ vs ఆస్ట్రేలియాలు మొత్తం 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆసీస్ జట్టు 9, భారత్ 5 విజయాలు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు భారత్-ఆసీస్ లు తలపడ్డాయి. ఇందులో రెండు సార్లు భారత్ గెలిచింది. ఒక సారి ఆసీస్ గెలిచింది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.
Steve Smith and Glenn Maxwell (Photo: ICC)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్-ఆసీస్ జట్లు ఇవే:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్, ఆడమ్ జంపా.