MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బలాలు, బలహీనతలు ఏంటి?

Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బలాలు, బలహీనతలు ఏంటి?

Team India: క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తొలి మ్యాచ్ ను గురువారం (ఫిబ్రవరి 20న) బంగ్లాదేశ్ తో  ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత జట్టు జట్టు బలం, బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 20 2025, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Team India: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఈ ఐసీసీ ట్రోఫీ మ్యాచ్ లు మార్చి 9 వరకు పాకిస్తాన్, దుబాయ్‌ వేదికలుగా జరగనున్నాయి. భారత తన మ్యాచ్ లు మొత్తం దుబాయ్ లో ఆడనుంది. ఈ సిరీస్‌లో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదరుచూస్తున్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని అందరూ ఎదురుచూస్తున్నారు.  అయితే, భారత జట్టు బలం, బలహీనతలు ఏంటి? టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి ఐసీసీ సిరీస్ కావొచ్చనే అంచనాలున్నాయి? మరి వీరిద్దరు ఏం చేయబోతున్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టుకు బలం. భారత టాప్-ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్, కోహ్లీతో తగినంత అనుభవం ఉంది. వీళ్లిద్దరూ బాగా ఆడితే తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. 

అలాగే, భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలతో ఇతర జట్లతో పోలిస్తే ఎక్కువ మంది ఆల్ రౌండర్లు భారత జట్టులో ఉన్నారు. వీరిలో ముగ్గురు కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలగడం టీమిండియాకు పెద్ద బలం. 

భారత జట్టులో మంచి స్పిన్ బౌలర్లు కూడా ఉన్నారు. దుబాయ్ పిచ్‌పై స్పిన్ బాగా తిరుగుతుంది. జట్టులో వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. అనుభవమున్న జడేజా, అక్షర్ పటేల్ ఎప్పుడైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. దీంతో పాటు కుల్దీప్ యాదవ్ దుబాయ్‌లో ఇదివరకే బాగా ఆడాడు. దీనివల్ల స్పిన్ బౌలింగ్‌లో ఇండియా మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది.

34
భారత క్రికెట్ జట్టు

భారత క్రికెట్ జట్టు

ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐసీసీ సిరీస్‌లలో ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే, ఈ మధ్యకాలంలో వన్డేల్లో దూకుడుగా క్రికెట్ ఆడుతోంది. ఇది కూడా భారత్ కు అనుకూలంగా మారుతోంది. 

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇది రుజువైంది. మ్యాచ్‌ను దూకుడుగా మొదలుపెడితే పెద్ద స్కోర్లు చేయొచ్చు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్ లు మొదలు పెడితే భారత్ భారీ స్కోర్లు చేస్తుంది.  

44
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత జట్టుకు పెద్ద బలహీనతగా చెప్పవచ్చు. మ్యాచ్ మొదట్లో, మధ్యలో, చివర్లో వికెట్లు తీయడంలో బుమ్రా కంటే గొప్ప బౌలర్లు ఎవరూ లేరు. బుమ్రా లేకపోవడం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని దెబ్బతీస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో షమీ తప్ప అనుభవమున్న ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. 

హర్షిత్ రాణా ఇప్పుడే జట్టులో చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ మంచి బౌలరే అయినా వన్డే క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఎక్కువ అనుభవం లేదు. అలాగే 3వ ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినా మ్యాచ్‌లో ప్రభావం చూపగలడా అనేది అనుమానమే

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
పాకిస్తాన్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved