- Home
- Sports
- Cricket
- Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షంతో రద్దైతే సెమీస్ చేరేది ఎవరు?
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షంతో రద్దైతే సెమీస్ చేరేది ఎవరు?
AUS vs AFG Weather Report: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 28) లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. సెమీ-ఫైనల్స్‌లో స్థానం కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే, వర్షంతో మ్యాచ్ రద్దు అయితే, సెమీస్ చేరేది ఎవరు?

Afghanistan vs Australia Weather Report: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్-4కు చేరుకుంటుంది. అదే సమయంలో, ఓడిపోయిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అవుతుంది.
Afghanistan team (Photo: X/@ACBofficials)
ఇప్పటికే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ ను దెబ్బకొట్టిన వాతావరణం
ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండు మ్యాచ్‌లు ప్రతికూల వాతావరణ, వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా చెరో ఒక పాయింట్ ను పంచుకోవలసి వచ్చింది. అలాగే, పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. రెండు జట్లకు ఒక్కొక్కటి పాయింట్ లభించింది.
ఆ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సమీకరణాన్ని ప్రభావితం చేయలేదు. రెండు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుండి ఔట్ అయ్యాయి. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు కారణంగా రెండు టీమ్స్ కు నష్టం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ను గెలిచిన జట్టు సెమీస్ చేరుకునేది. అయితే, మ్యచ్ రద్దుతో చెరో పాయింట్ ను పంచుకున్నాయి.
రావల్పిండిలో రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యయి
వర్షం కారణంగా రద్దు చేయబడిన రెండు మ్యాచ్‌లు రావల్పిండిలో జరిగాయి. అయితే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లాహోర్‌లో జరుగనుంది. అక్కడి వాతావరణానికి సంబంధించిన రిపోర్టులు కీలక విషయాలు వెల్లడించాయి. ఈ కీలక మ్యాచ్ కు ముందు లాహోర్ లో కూడా వాతావరణం బాగులేదు. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మ్యాచ్ ముందురోజు నగరంలో వర్షం పడినట్టు వాతావరణ నివేదికలు వెల్లడించాయి.
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ : లాహోర్ వాతావరణం ఎలా ఉండనుంది?
వెదర్.కామ్ ప్రకారం శుక్రవారం లాహోర్‌లో వర్షం పడే అవకాశం 70 శాతం ఉంది. అయితే, మ్యాచ్ సమయ అంచనా మెరుగ్గా ఉంది. మ్యాచ్ షెడ్యూల్ చేసిన సమయంలో (స్థానిక సమయం మధ్యాహ్నం 2:00, IST మధ్యాహ్నం 2:30 గంటలకు) వర్షం పడే అవకాశం 44 శాతం ఉంది. ఇది రాబోయే రెండు గంటల్లో వరుసగా 39 శాతం, 33 శాతానికి తగ్గుతుంది. స్థానిక సమయం సాయంత్రం 5:00 గంటల తర్వాత (IST సాయంత్రం 5:30) వర్షం పడే అవకాశం 9 నుండి 24 శాతం ఉంది. అయితే, వాతావరణం ఏ సమయంలో ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి వర్షం ప్రభావం పై ఆందోళన వ్యక్తమవుతోంది.
australia afganisthan
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయితే ఏ జట్టు టోర్నీ నుంచి ఔట్ అవుతుంది?
వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చనీ, మ్యాచ్ కాస్త ఆలస్యం కావచ్చని సమాచారం. మ్యాచ్ ఫలితం కోసం రెండు జట్లు కనీసం 20-20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ రౌండ్‌లో రిజర్వ్ డే లేదు. కాబట్టి మ్యాచ్ 20-20 ఓవర్లు జరగకపోతే ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు చేస్తారు.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే, పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కలిగి ఉన్న ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాసలవుతాయి. ఆ టీమ్ 3 మ్యాచ్‌లలో మొత్తం 3 పాయింట్లు కలిగి ఉంటుంది. దాని పాయింట్లు దక్షిణాఫ్రికా పాయింట్లకు సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్‌లో ఆఫ్ఘనిస్తాన్ చాలా వెనుకబడి ఉంది.
ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ -0.990 ఉండగా, దక్షిణాఫ్రికా +2.140 నికర రన్ రేట్‌తో ఉంది. అలాగే, సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌తో కూడా ఒక మ్యాచ్ ఆడాలి. ఓడిపోయినా, నికర రన్ రేట్‌లో ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందంజలో ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయితే, ఆఫ్ఘన్ టీమ్ నష్టం. ఆసీస్ సెమీస్ చేరుతుంది.