MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • SA vs ENG: సౌతాఫ్రికా దెబ్బకు ఇంగ్లాండ్ చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఔట్

SA vs ENG: సౌతాఫ్రికా దెబ్బకు ఇంగ్లాండ్ చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఔట్

SA vs ENG: దక్షిణాఫ్రికా జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 01 2025, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

South Africa vs England, Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో 4వ, చివరి సెమీఫైనలిస్ట్ గా సౌతాఫ్రికా ఎంట్రీ ఇచ్చింది. తన గ్రూప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తుచేసిన సౌతాఫ్రికా గ్రూప్ బీ లో టాప్ లో నిలిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి. 

ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ చేరుకున్నాయి. ఇంగ్లాండ్ పై గెలుపుతో దక్షిణాఫ్రికా టాప్-4లో చోటు దక్కించుకుంది. గ్రూప్-బీలో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 

ఏకపక్షంగా సాగిన సౌతాఫ్రికా-ఇంగ్లాండ్ మ్యాచ్ 

ఇంగ్లాండ్‌పై విజయంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఇక భారీ అంచ‌నాలున్న ఇంగ్లాండ్ జ‌ట్టు ఒక్క విజయం కూడా అందుకోకుండా ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయింది. అలాగే,  దక్షిణాఫ్రికా 4వ సెమీఫైనలిస్ట్ గా ఎంట్రీతో ఈ ఐసీసీ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం కూడా  ముగిసింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఈజీగానే విజ‌యాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పేలవమైన బ్యాటింగ్ తో 179 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ 37 పరుగులతో టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. మార్కో జాన్సెన్, ముల్డర్ లు చెరో 3 వికెట్లు తీసుకున్నారు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (72 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (64) అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా విజాయ‌న్ని అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

గ్రూప్ బీ పాయింట్ల ప‌ట్టిక: 

దక్షిణాఫ్రికా - 5 పాయింట్లు
ఆస్ట్రేలియా - 4 పాయింట్లు
ఆఫ్ఘనిస్తాన్ - 3 పాయింట్లు
ఇంగ్లాండ్ - 0 పాయింట్లు

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ ఒక్క విజయం కూడా ద‌క్క‌లేదు

ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి విజయం లేకుండానే టోర్నమెంట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. జోస్ బట్లర్ నేతృత్వంలోని జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో కూడా ఘోర‌మైన ఓట‌మితో టోర్న‌మెంట్ నుంచి ఔట్ అయింది. ఈ మ్యాచ్ కు ముందే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బట్లర్ నిర్ణ‌యించుకున్నాడు.

సెమీఫైనల్స్ లో ఏ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి? 

మార్చి 2న భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో ఏ జట్టుతో తలపడుతుందనేది ఆధారపడి ఉంటుంది. గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. న్యూజిలాండ్‌పై భారత్ గెలిస్తే దక్షిణాఫ్రికా కివీస్ జట్టుతో తలపడుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image3
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved