Champions Trophy 2025 : కేవలం ఒక్క టీమిండియా వెళ్లకుంటేనే... పాక్ కు ఇంత నష్టమా..!
ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్నిదేశాలు వెళ్లినా కేవలం ఒక్క భారత్ వెళ్లకపోవడంవల్ల ఛాంఫియన్స్ ట్రోఫీ 2025 నిర్వహించిన పాకిస్థాన్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఎంత నష్టం వచ్చిందో తెలుసా?

Champions Trophy 2025
Champions Trophy 2025 : పాకిస్థాన్ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాక్ లో అడుగు పెట్టకుండానే టీమిండియా ఈ ఘనత సాధించింది. దీంతో ఏ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో అయితే తమ కష్టాలు దూరమవుతాయి... క్రికెట్ గాడిలో పడుతుందని అనుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆశలు ఆవిరయ్యాయి. అన్నిదేశాలు వచ్చినా కేవలం ఒక్క ఇండియా మాత్రమే ఆ దేశంలో అడుగుపెట్టకపోవడంతో పాక్ భారీగా నష్టపోయింది.
కేవలం లీగ్ దశనుండే నిష్క్రమించడంతో పాకిస్థాన్ టీం పరువుపోయింది. ఎవరి చేతిలో అయితే ఓడిపోకూడదని అనుకుంటారో అదే భారత్ చేతిలో చిత్తుగా ఓడి సొంత ప్రేక్షకుల నుండే విమర్శలను ఎదుర్కొంది పాక్. ఇక ఇదే ఇండియా చివరకు పాక్ లో ఓ సెమీఫైనల్ తో పాటు ఫైనల్ కూడా జరగనివ్వకుండా చేసింది. దీంతో పాక్ ఆర్థికంగగానే తీవ్రంగా నష్టపోయింది.
నిజానికి 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ కు ఓ ఐసీసీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది. కానీ భారత్ కారణంగా ఆ టోర్నీ కూడా పూర్తిగా అక్కడ జరగలేదు. పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలు బాగాలేకపోవడంతో క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నారు.దీంతో పాక్ లో పర్యటించేందుకు టీమిండియాకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ క్రమంలో హైబ్రిడ్ పద్దతిలో టీమిండియా టోర్నీలో పాల్గొంది. అంటే అన్నిదేశాల మ్యాచులు పాకిస్థాన్ లో జరిగినా ఇండియాతో జరిగే మ్యాచులు మాత్రం దుబాయ్ లో జరిగాయి.
ఇలా ఒకటి రెండుకాదు ఏకంగా టీమిండియా ఆడిన లీగ్,సెమీ ఫైనల్,ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో జరిగాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఇలా పాక్ కు ఎంత నష్టం వాటిల్లిందో తెలుసుకుందాం.

Champions Trophy 2025
టీమ్ ఇండియా రాకపోవడంతో పాకిస్థాన్‌కు భారీ నష్టం :
భారత క్రికెట్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఏ దేశంలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినా భారత అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు చూస్తారు, డబ్బు వెదజల్లుతారు. దీనివల్ల మంచి ఆదాయం వస్తుంది. దీనివల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.
ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్థాన్ కూడా ఇదే ఆలోచనతో భారీగా డబ్బు ఖర్చు చేసింది. కానీ భారత్ పాక్ వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆ దేశ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇక మిగిలిన ఆశలను పాకిస్థాన్ జట్టు లీగ్ మ్యాచ్‌లోనే ఓడిపోయి పోగొట్టుకుంది. పాక్ కూడా టోర్నీనుండి నిష్క్రమించడంతో స్టేడియానికి పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా రాలేకపోయారు. ఇలా అనుకున్నస్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదు. దీనివల్ల పాకిస్థాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లింది.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం కారణంగా 1996 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ జరగలేదు. 2025లో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించే అవకాశం రావడంతో మంచి ఆదాయం వస్తుందని భావించారు. దీనికోసం కరాచీ, లాహోర్, రావల్పిండి క్రికెట్ స్టేడియాలను ఆధునీకరించారు. భద్రతను పెంచారు. కొన్ని పాక్ మీడియా కథనాల ప్రకారం, ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ 64 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 558 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీనితోపాటు ఆతిథ్యం, రవాణా కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. కానీ దీనివల్ల ఎలాంటి లాభం చేకూరలేదు. నష్టమే వాటిల్లింది.
Champions Trophy 2025
ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్థాన్‌కు ఎంత నష్టం?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు తన దేశంలో రెండే మ్యాచ్‌లు ఆడింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో భారత జట్టు చిత్తు చేసింది. ఈ రెండు ఓటముల తర్వాత పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌ల తర్వాత పాకిస్థాన్ స్టేడియంలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఛాంపియన్ ట్రోఫీ 2025 నిర్వహణ కోసం పాకిస్థాన్‌కు ఐసీసీ నుంచి 6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 52 కోట్ల రూపాయలు వస్తాయి. ప్రేక్షకులు రాకపోవడంతో టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోలేదు. దీనివల్ల ఆదాయం తక్కువగా వచ్చింది. విదేశీ ప్రేక్షకులు కూడా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి పాకిస్థాన్ వెళ్లలేదు. దీనివల్ల టోర్నమెంట్‌లో ఖర్చు చేసినంత ఆదాయం రాలేదు. ఓ అంచనా ప్రకారం ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్థాన్‌కు దాదాపు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

