MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఐసీసీ టోర్నమెంట్లలో పరుగుల వరద పారించే టాప్-5 బ్యాటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఐసీసీ టోర్నమెంట్లలో పరుగుల వరద పారించే టాప్-5 బ్యాటర్లు

Champions Trophy 2025: ఐసీసీ టోర్నమెంట్లలో  ప్లేయర్ల ఫామ్, కన్సిస్టెన్సీ చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా పరుగుల వరద పారించే బ్యాటర్లు ఉన్నారు. అలాంటి టాప్-5 ప్లేయర్ల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 18 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మినీ వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఈ మెగా టోర్నీలు సత్తా చాటడానికి 8 జట్లు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్‌లో జరిగే ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఊహాగానాలు మొదలుపెట్టారు.

 హైబ్రిడ్ మోడల్‌లో భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. చాలా మంది బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో వీళ్ళ ఫామ్, కన్సిస్టెన్సీ చూస్తే, ఈ టోర్నీలో పరుగుల వరద పారించే కొంత ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్‌కి అనుకూలం ఉంటే పాకిస్తాన్, దుబాయ్ పిచ్‌లపై ఐసీసీ టోర్నీ జరుగుతోంది. మరీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పరుగుల వరద పారించే లిస్టులో ఉన్న టాప్-5 ప్లేయర్ల వివరాలు మీకోసం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1. విరాట్ కోహ్లీ 

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. గత ఏడాదిగా కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. అప్పటి నుంచి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 

అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఫామ్‌లోకి రావడం టీమిండియాకు గుడ్ న్యూస్. ఐసీసీ టోర్నమెంట్లలో కోహ్లీ భారత్ కు కీలకమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక పరుగులు (765) చేసింది కోహ్లీనే. వన్డేల్లో కోహ్లీ సగటు 55గా ఉంది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని భావిస్తున్నారు.

36

2. మహమ్మద్ రిజ్వాన్ 

 ప్రస్తుతం మంచి ఫామ్ లో పాకిస్తాన్ క్రికెటర్ రిజ్వాన్  ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పరుగుల వరద పారిస్తాడని అంచనా. పాకిస్తాన్ తన రెండు గ్రూప్ మ్యాచ్‌లు (న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో) స్వదేశంలో ఆడనుంది. ఇక భారత్‌తో జరిగే మ్యాచ్ దుబాయ్‌లో ఆడుతుంది. సెమీస్‌కి అర్హత సాధిస్తే, పాకిస్తాన్ లాహోర్‌లో ఆడుతుంది. రిజ్వాన్ చాలా కన్సిస్టెంట్ బ్యాటర్. ఇటీవలి ట్రై సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 85.50 సగటుతో 171 పరుగులు చేయగా, అందులో ఒక సెంచరీ చేశాడు. గత ఏడాది నుంచి 12 మ్యాచ్‌ల్లో 62.14 సగటుతో 432 పరుగులు, ఒక సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రిజ్వాన్ పాకిస్తాన్ బ్యాటింగ్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.

46

3. ట్రావిస్ హెడ్

దూకుడైన బ్యాటింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యాటర్ ట్రావిస్ హెడ్. శ్రీలంకతో రెండో వన్డేలో హెడ్ కేవలం 18 పరుగులు చేశాడు. కానీ అతను ఆస్ట్రేలియాకి కీలక ఆటగాడు. ఐసీసీ టోర్నమెంట్లలో హెడ్ ఆస్ట్రేలియాకి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లను ఆడాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో, టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్న హెడ్.. ఛాంపియన్స్ ట్రోఫీ పరుతుఅ సునామీ రేపుతాడని భావిస్తున్నారు.

56

4. కేన్ విలియమ్సన్ 

ఏడాది తర్వాత ఇటీవలి ట్రై సిరీస్‌తో కేన్ విలియమ్సన్ వన్డేలకి తిరిగి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల్లో 112.50 సగటుతో 225 పరుగులు చేయగా, ఇందరలో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 113 బంతుల్లో 133 పరుగులు చేసి న్యూజిలాండ్‌ని గెలిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విలియమ్సన్ ఫామ్‌లోకి రావడం న్యూజిలాండ్‌కి సూపర్ గుడ్ న్యూస్. ఐసీసీ టోర్నమెంట్లలో విలియమ్సన్ ఎప్పుడూ రాణిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విలియమ్సన్ పరుగుల వరద పారిస్తాడని అంచనా.

66

5. హెన్రిచ్ క్లాసెన్ 

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హెన్రిచ్ క్లాస్ తనదైన ఆటతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లాసెన్ అత్యధిక పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవలి ట్రై సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడి 87 పరుగులు చేశాడు. గత ఏడాది నుంచి 4 వన్డేల్లో 87.75 సగటుతో 351 పరుగులు చేయగా, మూడు అర్థసెంచరీలు చేశాడు. వన్డేల్లో క్లాసెన్ చాలా కన్సిస్టెంట్ ప్లేయర్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ని క్లాసెన్ నడిపిస్తాడని అంచనా. వన్డే ప్రపంచకప్ 2023లో 41.44 సగటుతో 300 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్ లు ఆడతాడనే అంచనాలున్న టాప్ క్లాస్ ప్లేయర్. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
పాకిస్తాన్
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved