- Home
- Sports
- Cricket
- IND vs NZ : క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ... హైదరాబాద్ థియేటర్స్ లో రోహిత్, కోహ్లీ బొమ్మ
IND vs NZ : క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ... హైదరాబాద్ థియేటర్స్ లో రోహిత్, కోహ్లీ బొమ్మ
మైదానంలో కూర్చుని మీ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ చూసుంటారు... థియేటర్ లో కూర్చుని మీ అభిమాన హీరో సినిమా చూసుంటారు. కానీ సినిమా థియేటర్ లో కూర్చుని బిగ్ స్క్రీన్ పై టీమిండియా హీరోలు రోహిత్, కోహ్లీల మెరుపులు చూసే అద్భుత అవకాశం వచ్చింది. టికెట్స్ ఎలా పొందాలంటే...

ICC Champions Trophy 2025 Final
ICC Champions Trophy 2025 Final : క్రికెట్ ... ఈ పదంతో భారతీయ యువతకు ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. క్రికెట్ ఆడటమే కాదు చూడటాన్ని కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. మరీముఖ్యంగా టీమిండియా విదేశీ జట్లతో ఆడుతుంటే ఆ మ్యాచ్ చూసేందుకు స్కూళ్లు, కాలేజీలకే కాదు ఆఫీసులకు డుమ్మాకొడుతుంటారు... దీన్నిబట్టే క్రికెట్ ను ఎంతలా అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు.
సాధారణ మ్యాచులనే ఇంతలా అభిమానిస్తే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడే జట్లన్ని తలపడే ఐసిసి టోర్నీలను వదిలిపెడతారా... అస్సలు వదిలిపెట్టరు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఇదే జరుగుతోంది. టీమిండియా మ్యాచ్ ఉన్నపుడు అందరూ టీవీలు,ఫోన్లకు అతుక్కుపోతున్నారు...దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్లు ఆరోజు ఖాళీగా కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు టీమిండియా ఛాంపింయన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరింది... అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. దీంతో అభిమానులకు మరింత అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు జియోస్టార్, పివిఆర్ ఐనాక్స్ సరికొత్త ఆలోచన చేసారు. మార్చి 9 అంటే వచ్చే ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్ జట్లమధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను బిగ్ స్క్రీన్ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది విని క్రికెట్ ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు.
IND vs NZ
ఇండియా,న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్స్ ఎలా పొందాలి?
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై అభిమానులు చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని PVR INOX సరికొత్త ఆలోచన చేసింది. ఈ మెగా టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న JioStar తో ప్రత్యేకంగా ఓ ఒప్పందాన్ని చేసుకుంది. దీంతో ఈ టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ అయిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను తమ మల్టిపెక్స్ థియేటర్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
ఇప్పుడు మళ్ళీ అలాంటి హైఓల్టేజ్ మ్యాచ్ కు టీమిండియా సిద్దమవుతోంది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వేదికన టీమిండియా-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్ పోరులో విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది... ఈ మ్యాచ్ రసవత్తంగా సాగనుంది. దీంతో మార్చి 9న (ఆదివారం) జరిగే ఫైనల్ మ్యాచ్ ను మల్టిపెక్స్ లలో ప్రత్యక్షప్రసారం చేసేందుకు పివిఆర్ ఐనాక్స్ సిద్దమయ్యింది.
ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను మల్టిప్లెక్స్ లో చూడాలనుకునేవారికోసం టికెట్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించారు. వివిధ టికెట్ బుకింగ్ యాప్స్ లో ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. థియేటర్ లో అందరితో కలిసి బిగ్ స్క్రీన్ పై మీ అభిమాన క్రికెటర్ల ఆటను చూడాలంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకొండి. హైదరాబాద్ లోని PVR INOX మాల్స్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు.
Team India
ఇండియా vs న్యూజిలాండ్ : ఇరుజట్ల బలాలు ఇవే :
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో తలపడనున్న ఇరుజట్లు చాలా బలంగా ఉన్నాయి... ఆటగాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే న్యూజిలాండ్ కంటే ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
దుబాయ్ లోనే ఫైనల్ జరగడం :
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నా టీమిండియా మాత్రం ఆ దేశానికి వెళ్లలేదు. అన్నిదేశాలు పాక్ లో ఆడితే భారత్ మాత్రం దుబాయ్ లో ఆడుతోంది. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఏ దేశమైన దుబాయ్ కి వెళ్లాల్సిందే... చివరకు ఆతిథ్య పాక్ కూడా ఇలాగే చేసింది. ఇలా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులను ఒకే స్టేడియంలో ఆడింది టీమిండియా.ఫైనల్ కూడా ఇదే మైదానంలో జరగనుంది. కాబట్టి ఇప్పటికే దుబాయ్ గ్రౌండ్ కు టీమిండియా ఆటగాళ్లు అలవాటుపడ్డారు... ఫైనల్లో ఇది కలిసివస్తుంది.
టీమిండియా స్మిన్నర్ల ఫామ్ :
దుబాయ్ మైదానంలో స్లో పిచ్ ఉంది. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే భారత స్పిన్ దళం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లతో బలంగా ఉంది. ఇప్పటికే ఈ మైదానంలో మన స్పిన్నర్లు అదరగొట్టారు. ఇది భారత్ కు కలిసివచ్చే మరో అంశం.
లీగ్ దశలో న్యూజిలాండ్ ను ఓడించడం :
ఇదే మైదానంలో లీగ్ దశలో టీమిండియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో భారత జట్టు విజయం సాధించింది. ఇది టీమిండియాకు కాన్ఫిడెంట్ ఇచ్చే విషయం. సేమ్ మైదానం, సేమ్ పిచ్... కాబట్టి న్యూజిలాండ్ ను మరోసారి ఓడించడం కష్టం కాదని భారత అభిమానులు భావిస్తున్నారు.
మొత్తంగా భారత్, న్యూజిల్యాండ్ జట్లు బలంగా ఉన్నాయి... కాబట్టి ఫైనల్లో హోరాహోరీ తప్పదు. కానీ టైటిల్ మాత్రం టీమిండియాదే అన్న ధీమాతో అభిమానులు ఉన్నాయి. మరి ఫలితం ఎలా ఉంటుందో వచ్చే ఆదివారం చూడాలి.