- Home
- Sports
- Cricket
- పిచ్ తప్పేం లేదు! ఇది పూర్తిగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూరే... టెయిలెండర్లను అవుట్ చేయడానికి కూడా...
పిచ్ తప్పేం లేదు! ఇది పూర్తిగా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూరే... టెయిలెండర్లను అవుట్ చేయడానికి కూడా...
నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియాని చిత్తు చేసింది టీమిండియా. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాకి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కినా, విజయం మాత్రం టీమిండియానే వరించింది. అయితే రెండు వరుస విజయాల తర్వాత వారం బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ టీమిండియా ఆటతీరును పూర్తిగా మార్చేసింది...

Image credit: Getty
రెండో టెస్టు తర్వాత దొరికిన సమయాన్ని ఆస్ట్రేలియా ప్రాక్టీస్ కోసం వాడుకుంటే, టీమిండియా ప్లేయర్లు మాత్రం కుటుంబంతో కలిసి షాపింగ్స్ చేయడానికి, పెళ్లిళ్లకు, పార్టీలకు హాజరుకావడానికి ఉపయోగించుకుంది. దాని రిజల్టే ఇండోర్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం...
Rohit Sharma-Virat Kohli
మూడో టెస్టు ఓడిన తర్వాత కూడా టీమిండియా తీరు మారలేదు. ఇండోర్ టెస్టులో స్పిన్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్ సేన, అహ్మదాబాద్ టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్ తయారుచేయించింది. కానీ టాస్ ఓడడంతో సీన్ రివర్స్ అయ్యింది...
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా... భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కి 208 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫలితంగా రెండు సెషన్ల పాటు వికెట్ తీయలేకపోయారు భారత బౌలర్లు...
Image credit: PTI
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 7 ఏళ్ల పాటు టెస్టులు ఆడిన టీమిండియా... 7 ఏళ్లలో కేవలం రెండు సెషన్లలో మాత్రమే వికెట్లు తీయలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో టెస్టు ఆడుతూ ఒకే టెస్టులో రెండు సెషన్ల పాటు వికెట్ తీయలేకపోయారు భారత బౌలర్లు...
కామెరూన్ గ్రీన్ 114, ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేసి అవుటైన తర్వాత కూడా టాడ్ ముర్ఫీ, నాథన్ లియాన్ కలిసి 9వ వికెట్‌కి 70 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ 19 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు...
ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ని బౌలింగ్ నుంచి తప్పించి, అతని ప్లేస్‌లో మహ్మద్ షమీని తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. ఈ స్ట్రాటెజీ ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. 2 వికెట్లు పడిన తర్వాత అతన్ని అదే ఎండ్‌లో కొనసాగించడం ప్రతీ కెప్టెన్ కామన్‌గా చేసే పని. అయితే రోహిత్ మాత్రం అతన్ని 2 ఓవర్లు ఆపి, మరో ఎండ్‌లో తీసుకొచ్చాడు...
Image credit: Getty
టెయిలెండర్లు నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ స్పిన్ బౌలర్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదుతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇక్కడే టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ అనుభవం, రోహిత్ శర్మ అనుభవానికి మధ్య తేడా క్లియర్‌గా కనిపించింది. భారత టెయిలెండర్లు బ్యాటింగ్‌కి రాగానే స్పిన్నర్లను తప్పించి, తన ఫాస్ట్ బౌలర్లను తీసుకొచ్చాడు స్టీవ్ స్మిత్... రోహిత్ మాత్రం వరుసపెట్టి బౌలర్లను మారుస్తూ కాలక్షేపం చేశాడు...
Usman Khawaja
ఉస్మాన్ ఖవాజా 10 గంటల పాటు క్రీజులో కుదురుకుపోయి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు.. ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేసేందుకు రవీంద్ర జడేజానే సరైనోడు అని ఫిక్స్ అయిపోయిన రోహిత్ శర్మ, అతనితో ఎక్కువ ఓవర్లు వేయించాడు. జడేజా కోసం డీఆర్‌ఎస్ రివ్యూలు కూడా తీసుకుని వృథా చేశాడు...
ఉస్మాన్ ఖవాజా వికెట్ కోసం అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే అప్పుడు కెప్టెన్‌గా ఉన్నది ఛతేశ్వర్ పూజారా. రోహిత్ శర్మ టీ బ్రేక్ తర్వాత కాసేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే సేద తీరడంతో పూజారా స్టాండ్ బై కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదే రోహిత్ శర్మ క్రీజులో ఉండి ఉంటే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డీఆర్ఎస్ తీసుకునేవాడా? అనేది అనుమానమే...
Image credit: PTI
పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది. అయితే ఇలాంటి పిచ్‌లపై టీమిండియా చాలాసార్లు మ్యాచులు గెలిచింది. స్పిన్నర్లు ఫెయిల్ అయినప్పుడు భారత ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయగలరు. అయితే బౌలర్లను ఎలా మార్చాలనే విషయంలో రోహిత్ శర్మ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది...
Rohit Sharma
‘మొదటి రోజు ఆఖరి సెషన్‌లోనే టీమిండియా పట్టు కోల్పోయింది. కొత్త బంతిని తీసుకున్న తర్వాత ఏ బౌలర్‌ని వాడాలో రోహిత్‌కి తెలియలేదు. ఉమేశ్ యాదవ్ వయసు 35 ఏళ్లు, షమీ వయసు కూడా దాదాపు అంతే.. అప్పటికే ఈ ఇద్దరూ చాలా ఓవర్లు బౌలింగ్ చేశారు...
Image credit: Getty
ఫాస్ట్ బౌలర్లు అలిసిపోయారు. వారితో ఆఖరి సెషన్‌లో రెండు ఓవర్లు వేయించడం మంచిదే కానీ రోహిత్ శర్మ ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. ఇలాంటి పిచ్‌పై కెప్టెన్సీ చేయడం రోహిత్‌కి ఇదే తొలిసారి. భారత్‌లో స్పిన్ పిచ్‌లపై కెప్టెన్సీ చేయడం, విదేశీ పిచ్‌లపై కెప్టెన్సీ చేయడం ఒక్కటి కాదు.
Image credit: PTI
అలాగే భారత్‌లో ఇలాంటి బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పైన జట్టును నడిపించడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఇది రోహిత్‌కి ఓ గుణపాఠంలాంటిది. మనదగ్గరున్న అస్త్రాలను ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో రోహిత్ శర్మ తెలుసుకుంటాడని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..