- Home
- Sports
- Cricket
- రహానేను వైస్ కెప్టెన్‌గా నియమించి తప్పుచేశారు.. భారత క్రికెట్‌లో అది మిస్ అయింది: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
రహానేను వైస్ కెప్టెన్‌గా నియమించి తప్పుచేశారు.. భారత క్రికెట్‌లో అది మిస్ అయింది: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
వెస్టిండీస్ సిరీస్ కు అజింక్యా రహానేను టెస్టులలో వైస్ కెప్టెన్ గా నియమించడాన్ని ప్రస్తావిస్తూ.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ బోర్డు, సెలక్టర్లపై మరోసారి ఫైర్ అయ్యాడు.

టీమిండియా ఆటతీరు, సెలక్టర్లు, బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి ఫైర్ అయ్యాడు. భారత క్రికెట్ జట్టులో జవాబుదారీతనం లేదని.. అసలు వెస్టిండీస్ సిరీస్ కు అజింక్యా రహానేను వైస్ కెప్టెన్ గా నియమించడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై గడిచిన రెండ్రోజులుగా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న గవాస్కర్ తాజాగా ఆ దాడిని కొనసాగించాడు. వెస్టిండీస్ సిరీస్ కు అజింక్యా రహానేను టెస్టులలో వైస్ కెప్టెన్ గా నియమించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘వెస్టిండీస్ టూర్‌లో సెలక్టర్లు రహానేను టెస్టులకు వైస్ కెప్టెన్ గా రహానేను నియమించారు.
ఈ క్రమంలో టీమిండియా గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకుంది. రహానే వైస్ కెప్టెన్ గా ఉండటంలో తప్పులేదు. కానీ సెలక్టర్లు మాత్రం ఓ యువ ఆటగాడిని భావి సారథిగా తీర్చిదిద్దే చక్కటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. టీమిండియాలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ వంటి వాళ్లు జట్టులో వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు.
ఇలాంటివాళ్లకు టెస్టులలో వైస్ కెప్టెన్సీ ఇస్తే వాళ్లు ఇప్పట్నుంచే పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించడం చేస్తారు. క్రమక్రమంగా కెప్టెన్సీ లక్షణాలను కూడా అలవరుచుకుంటారు. వైస్ కెప్టెన్సీకి గిల్, అక్షర్ బాగా పనికొస్తారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ అంచనాలకు మించి రాణిస్తున్నారు.
వీళ్లకు వైస్ కెప్టెన్సీ ఇస్తే వాళ్లకు ఓ ధైర్యం కూడా ఉంటుంది. భవిష్యత్ లో వారికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని చెప్తే వాళ్లు పురోగమిస్తారు.. గిల్, అక్షర్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. టీమ్ లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే అతడు కూడా కెప్టెన్సీ రేసులోకి వచ్చే అవకాశం లేకపోలేదు..’ అని గవాస్కర్ చెప్పాడు.
ఇంకా గవాస్కర్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ లో జవాబుదారీతనం లోపించిందని దుయ్యబట్టాడు. సిరీస్ లకు సిరీస్ లు, ఐసీసీ టోర్నీలు ఓడినా కెప్టెన్లను మార్చడం లేదని.. వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని కెప్టెన్లను కొనసాగిస్తున్నారని ఆరోపించాడు. గడిచిన పదేండ్లుగా ఇదే పద్ధతి కొనసాగుతుందని అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు సమీక్ష సమావేశం లేదని సన్నీ ఆవేదన వ్యక్తం చేశాడు.