భువీ రీఎంట్రీ అదుర్స్... హాఫ్ సెంచరీ చేసిన సురేష్ రైనా... దినేశ్ కార్తీక్ అదిరే ఇన్నింగ్స్...
First Published Jan 11, 2021, 6:31 AM IST
జనవరి 10న ప్రారంభమైన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 లీగ్‌లో భారత సీనియర్లు అదరగొట్టారు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన పేసర్ భువనేశ్వర్ కుమార్... మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడి దాదాపు మూడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న భువీ... పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ 2020లో భువీ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన ఇది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టినా యూపీకి విజయాన్ని అందించలేకపోయాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్టు కోల్పోయి 134 పరుగులు చేసింది. సిమ్రాన్ సింగ్ 43, అన్‌మోల్ ప్రీత్ సింగ్ 35 పరుగులు చేశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?